
బిగ్‌బాస్ రియాలిటీ షోతో చాలామంది నటీనటులు బాగానే పేరు తెచ్చుకున్నారు. అలాంటి వాళ్లలో గౌతమ్ కృష్ణ ఒకడు. తెలంగాణకు చెందిన ఇతడు స్వతహాగా డాక్టర్. కానీ నటనపై ఆసక్తితో ఒకటి రెండు సినిమాలు కూడా చేశారు. కాకపోతే పెద్దగా పేరు రాలేదు. అలా బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం రావడంతో కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు.
(ఇదీ చదవండి: నా ఐటమ్ సాంగ్ చూస్తూ పిల్లలు భోంచేస్తున్నారు: తమన్నా)
బిగ్‌బాస్ 7వ సీజన్‌లో అశ్వద్ధామ అంటూ హడావుడి చేసిన గౌతమ్.. మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయి వెళ్లిపోయాడు. కానీ మరోసారి అవకాశం రావడంతో గతేడాది జరిగిన 8వ సీజన్‌లోనూ పాల్గొన్నాడు. రన్నరప్‌గా నిలిచాడు. రీసెంట్‌గానే 'సోలో బాయ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. చిన్న సినిమా కావడంతో థియేటర్లలో పెద్దగా చూడలేదు. ప్రస్తుతం ఓటీటీలో ఉంది.
అసలు విషయానికొస్తే గౌతమ్ ఇప్పుడు ఓ శుభవార్త చెప్పాడు. తన కుటుంబంలోకి కొత్త మెంబర్ రాబోతున్నారని ఫొటో పోస్ట్ చేశాడు. తన వదిన ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్నారని చెబుతూ, ఆమెకు సీమంతం చేసిన విషయాన్ని బయటపెట్టాడు. మరి అన్నయ్య-వదిన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. మరి గౌతమ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో చూడాలి.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 37 సినిమాలు)