యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Feb 3 2026 7:54 AM | Updated on Feb 3 2026 7:54 AM

యువకు

యువకుడి ఆత్మహత్య

వేలూరు: తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం సమీపంలోని పుదుపాళ్యం గ్రామానికి చెందిన కందన్‌ కుమారుడు విజయకుమార్‌(26) బీఏ పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఎటువంటి ఉద్యోగం రాక పోవడంతో నిరాశతో ఉన్న అతను జీవితంపై విరక్తి చెందాడు. పీఎంకే పార్టీలో సభ్యునిగా ఉన్న విజయకుమార్‌ ఆదివారం వన్నియర్‌ సంఘం అధ్యక్షులు కాడువెట్టిగురు జయంతి వేడుకలను జరుపుకున్నారు. అనంతరం ఇంటికి వచ్చిన విజయకుమార్‌ తన డైరీ పూర్తిగా వన్నియర్‌కు ప్రత్యేక రిజర్వేషన్‌ కల్పించాలని పలు చోట్ల రాసి పెట్టడంతో పాటు కొన్ని పేపర్లును చేతిలో పెట్టుకొని ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నమంగళం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టు మార్గం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, మృతుడు చేతిలోని లేఖను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ విషయం తెలియడంతో పీఎంకే పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. మృతుడి చేతిలోని లేఖను బహిర్గతం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు.

యువకుడి ఆత్మహత్య 1
1/1

యువకుడి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement