వ్యవసాయం వృద్ధి కోసం పూజలు | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయం వృద్ధి కోసం పూజలు

Feb 3 2026 7:54 AM | Updated on Feb 3 2026 7:54 AM

వ్యవసాయం వృద్ధి కోసం పూజలు

వ్యవసాయం వృద్ధి కోసం పూజలు

తిరువొత్తియూరు: దిండుక్కల్‌ జిల్లా, వేడసంతూర్‌ సమీపం కోట్టూర్‌ దేవి నాయక్కన్‌ పట్టి గ్రామం ఉంది. ఇక్కడ వ్యవసాయం వృద్ధి చెందాలని, ప్రతి సంవత్సరం తైపూసం రోజున, ఒక చిన్న అమ్మాయిని(బాలిక) చంద్రుని అమ్మాయిగా ఎంపిక చేసి పూజలు చేస్తున్నారు. దీనికి ముందు 8 రోజులు ఊరిలో పూజలు చేస్తారు. ఇందులో ఊరిలోని బాలికలందరూ పాల్గొంటారు. వారిలో ఒకరిని నిలాప్పెని(చంద్రుని కుమార్తె)గా ఎంపిక చేసి తైపూసం రోజున పూజిస్తారు. ఈ సంవత్సరం కూడా ఆ గ్రామంలో గత 8 రోజులుగా జరిగిన పూజల్లో బాలికలు పాల్గొన్నారు. ఇందులో అదే గ్రామానికి చెందిన జయరామచంద్రమూర్తి–మహాలక్ష్మి దంపతుల కూతురు జియాశ్రీ (13) అనే అమ్మాయి నిలాప్పెన్‌గా ఎంపిక అయింది. దీని తర్వాత ఆదివారం రాత్రి గ్రామ మహిళలు జియాశ్రీని ఊరి సరిహద్దులో ఉన్న సరళిమలైకి తీసుకెళ్లి (ఆవరం) తంగేడు పూలతో అలంకరించారు. తర్వాత తంగేడు(ఆవరం) పూలు నిండిన బుట్టను మోస్తూ ఆ అమ్మాయిని ఊరేగింపుగా ఊళ్లోకి తీసుకొచ్చారు. గ్రామంలోని మారియమ్మన్‌ గుడిలో స్నేహితురాళ్లతోపాటు ఆ అమ్మాయిని కూర్చోబెట్టారు. తర్వాత ఊరి సరిహద్దులో ఉన్న బావి దగ్గరికి అమ్మాయిని తీసుకెళ్లి, బుట్టలో ఉన్న(ఆవరం) తంగేడు పూలను బావి నీటిలో వేసి, మట్టి కలశంలో దీపం వెలిగించి నీటిలో తేలియాడించి పూజలు చేశారు. తర్వాత గ్రామ ప్రజలు ఊరికి తిరిగి వచ్చారు. వంద సంవత్సరాలకు పైగా ఈ సాంప్రదాయ పూజను కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement