రవితేజ 'మాస్‌ జాతర' కోసం వస్తున్న సూర్య | Actor suriya chief guest to ravi teja movie mass jathara pre release event | Sakshi
Sakshi News home page

రవితేజ 'మాస్‌ జాతర' కోసం వస్తున్న సూర్య

Oct 27 2025 11:12 AM | Updated on Oct 27 2025 11:12 AM

Actor suriya chief guest to ravi teja movie mass jathara pre release event

'మాస్‌ జాతర'(Mass Jathara) కోసం కోలీవుడ్‌ నటుడు 'సూర్య' వచ్చేస్తున్నారు. ధమాకా లాంటి భారీ విజయం తర్వాత హీరో రవితేజ, హీరోయిన్‌ శ్రీలీల జోడీగా నటిస్తున్న చిత్రం మాస్‌ జాతర.. ఈ చిత్రంలో రైల్వే  పోలీస్‌ లక్ష్మణ్‌ భేరి పాత్ర  చేస్తున్నారు రవితేజ. విలన్‌గా నవీన్‌ చంద్ర కనిపిస్తారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా  అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ క్రమంలో ఈ నెల28న ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేసింది.

రవితేజ మాస్‌ జాతర ప్రీ- రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నటుడు సూర్య వస్తున్నట్లు ఒక పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. అక్టోబర్‌ 28న సాయంత్రం 5:30గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్‌సీ (JRC) వేదికగా ఈ కార్యక్రమం జరగనుందని మేకర్స్‌ ప్రకటించారు. ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ యూ/ఏ సర్టిఫికెట్‌ లభించింది. సినిమా రన్‌టైమ్‌  160 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ఒకరోజు ముందే  ప్రీమియర్స్‌ వేసేందుకు చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేసింది.

సూర్య 46వ సినిమాను కూడా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. దీంతో నాగవంశీతో సూర్యకు అనుబంధం ఏర్పడింది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్నంలో మమితా బైజు, రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement