breaking news
pree release function
-
రవితేజ 'మాస్ జాతర' కోసం వస్తున్న సూర్య
'మాస్ జాతర'(Mass Jathara) కోసం కోలీవుడ్ నటుడు 'సూర్య' వచ్చేస్తున్నారు. ధమాకా లాంటి భారీ విజయం తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల జోడీగా నటిస్తున్న చిత్రం మాస్ జాతర.. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్ర చేస్తున్నారు రవితేజ. విలన్‌గా నవీన్ చంద్ర కనిపిస్తారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ నెల28న ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.రవితేజ మాస్ జాతర ప్రీ- రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నటుడు సూర్య వస్తున్నట్లు ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అక్టోబర్ 28న సాయంత్రం 5:30గంటలకు హైదరాబాద్‌లోని జేఆర్సీ (JRC) వేదికగా ఈ కార్యక్రమం జరగనుందని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సినిమా రన్‌టైమ్ 160 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలకు ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.సూర్య 46వ సినిమాను కూడా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. దీంతో నాగవంశీతో సూర్యకు అనుబంధం ఏర్పడింది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్నంలో మమితా బైజు, రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.The celebration just got BIGGER! 💥🔥The one and only @Suriya_offl garu to grace the grand pre-release event of #MassJathara 😍📍TOMORROW from 5:30 PM Onwards at JRC CONVENTIONS, HYD!In cinemas worldwide #MassJatharaOnOct31st Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14… pic.twitter.com/IUkt8NgMbM— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2025 -
‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’
గోవింద్ రాజ్, సంతోష్, సీహెచ్ సిద్దేశ్వర్, మందార్, కిరణ్, పూజ, అనుపమ, లావణ్య ప్రధాన పాత్రల్లో అతిమళ్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో శ్రీలత బి.వెంకట్ నిర్మించిన చిత్రం ‘సర్వం సిద్ధం’. ‘నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’ అనేది ట్యాగ్‌లైన్. వచ్చే నెల 16న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాతలు బెల్లంకొండ సురేష్, రామసత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘‘పుష్కలమైన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించడానికి మా సినిమా సిద్ధంగా ఉంది. నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’’ అన్నారు దర్శక–నిర్మాత ఎన్ ఆర్ రెడ్డి. ‘‘ఇది మంచి కామెడీ మూవీ’’ అన్నారు రాబిన్ -
మహేష్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్. ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారయ్యాయి. సినిమా విడుదలకు సరిగ్గా ఆరు రోజుల ముందు అంటే జనవరి 5న ‘సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అత్యంత భారీగా ఈ వేడుకను జరపనున్నారు. ఈ మేరకు ఆదివారం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్టర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. జనవరి 5న సాయంత్రం 5.04 గంటలకు ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభమవుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మికా మండన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని. ‘దిల్’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, లిరికల్ వీడియో సాంగ్స్‌కు మంచి స్పందన వస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
అదే జోరు.. అదే హుషారు
♦ ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి ♦ అభిమానులే నా శక్తి ♦ సినిమాను రామ్‌చరణ్ బాగా నిర్మించాడు ♦ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలన్నీ బాగా ఆడాలి ♦ కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి: దాసరి ♦ చిరుతో సినిమా: టీఎస్సార్ సాక్షి, సినిమా డెస్క్: ‘‘రాననుకున్నారా? రాలేననుకున్నారా? ఢిల్లీకి పోయాడు, డ్యాన్సులకు దూరమైపోయాడు! హస్తినాపురానికి పోయాడు, హాస్యానికి దూరమైపోయాడు! ఈ మధ్య కాలంలో మా మధ్య లేడు. అందుకని, మాస్‌కి దూరమైపోయాడు అనుకుంటున్నారేమో! అదే మాసు.. గ్రేసు.. అదే హోరు.. జోరు! అదే హుషారు’’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఆయన హీరోగా నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ వేడుక శనివారం రాత్రి గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో జరిగింది. ‘బాస్ ఈజ్ బ్యాక్ ఫెస్టివల్’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకకుముఖ్య అతిథిగా హాజరైన దర్శకరత్న దాసరి నారాయణరావు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘కృషితో, పట్టుదలతో పైకి వచ్చిన వ్యక్తి చిరంజీవి. ఇంత భారీగా వేడుక జరగడం ఇది మొదటిసారి. తొమ్మిదేళ్ల తర్వాత ఓ హీరో మళ్లీ నటించడం అనేది చరిత్రలో మొదటిసారి. ఆయన సినిమా కోసం ఎదురు చూసిన లక్షలాది మెగా ఫ్యాన్స్‌కి సమాధానం ఈ ‘ఖైదీ నంబర్ 150’. ‘ఖైదీ’ రోజుల్లో ఎలా ఉన్నాడో.. అదే విధంగా వచ్చాడు. ఏ ప్రభుత్వాలూ రైతు సమస్యలను పట్టించుకోని పరిస్థితుల్లో.. ప్రజల్ని చైతన్యపరిచిన మనిషి ఈ సినిమాలో హీరో’’ అని చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఈ అభిమానుల్ని చూస్తుంటే కృష్ణానది పక్కన ఉన్నానా? విశాఖ సముద్రతీరంలో ఉన్నానా? అనే అనుమానం కలుగుతోంది. బాస్ ఈజ్ బ్యాక్ అంటుంటే... నాకు ఓ ఉర్దూ షాహిరిలో చెప్పినట్లు ఈ పదేళ్లు నాకు పది క్షణాల్లా గడిచాయి. పదేళ్ల తర్వాత కూడా పాతికేళ్ల ముందున్న ఊపు, ఉత్సాహం నాలో నింపిన ఆ శక్తి మీరే.. నా తమ్ముళ్లే (అభిమానులు) ఆ శక్తి. 150వ సినిమాగా ఏ సినిమా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ‘కత్తి’ చూశా. ఈ కథ అనుకోగానే నాకు మొదట స్ఫురణకు వచ్చిన దర్శకుడు వీవీ వినాయక్. రామ్‌చరణ్ ఈ సినిమాని బాగా నిర్మించాడు. టీమ్ అందరూ కష్టపడి పని చేశారు. ఫంక్షన్ సజావుగా జరగడానికి సహకరించిన ఏపీ పోలీసులకు, ఇతర సిబ్బందికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు. సంక్రాంతి సందర్భం గా విడుదలవుతున్న నా సోదరుడు బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, శర్వానంద్ ‘శతమానం భవతి’, ఆర్. నారాయణమూర్తి ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’తో పాటు ఏ సినిమా రిలీజైనా సూపర్ హిట్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ఆకాంక్షిం చారు. టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడు నేను సినిమాలు తీయడంలేదు. చిరంజీవి, పవన్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌తో ఓ సినిమా తీస్తా’’ అన్నారు. తర్వాత దర్శకుడు వినాయక్, నిర్మాత రామ్‌చరణ్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కుటుంబ సభ్యులు, నిర్మాత డీవీవీ దానయ్య, ‘ఆదిత్య కన్స్ట్రక్షన్’ తోట చంద్రశేఖర్, నటులు బ్రహ్మానందం, ఆలీ, రఘుబాబు, రచయితలు పరుచూరి బ్రదర్స్, ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్, ‘లహరి మ్యూజిక్’ మనోహర్ తదితరులు హాజరయ్యారు. మెగా‘ఖైదీ’పై పోటెత్తిన అభిమానం మంగళగిరి/తాడేపల్లి రూరల్: ఖైదీ నంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అభిమానులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాహనాల పార్కింగ్‌కు స్థలం లేకపోవడంతో జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాల ను పార్కింగ్ చేశారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపో యింది. ఇక హాయ్‌ల్యాండ్ ప్రధాన ద్వారం వద్దే అభిమానులను ఆపివేయడంతో ఆగ్రహిం చిన అభిమానులు పోలీసులపై దాడికి దిగడం తో ఉద్రిక్తత నెలకొంది. ఇదే సమయంలో తొక్కిసలాట జరిగింది. దాదాపు 15 మంది గాయపడ్డారు. గాయపడ్డ పలువురిని పరిసర ప్రాంతాల్లోని వివిధ ఆస్పత్రులకు తరలించా రు. అభిమానుల సంఖ్యలను అంచనా వేయలేకపోయిన పోలీసులు.. పరిస్థితిని అదుపు చేయడంలో చేతులెత్తేశారు.


