‘‘రాననుకున్నారా? రాలేననుకున్నారా? ఢిల్లీకి పోయాడు, డ్యాన్సులకు దూరమైపోయాడు! హస్తినాపురానికి పోయాడు, హాస్యానికి దూరమైపోయాడు! ఈ మధ్య కాలంలో మా మధ్య లేడు. అందుకని, మాస్‌కి దూరమైపోయాడు అనుకుంటున్నారేమో! అదే మాసు.. గ్రేసు.. అదే హోరు.. జోరు! అదే హుషారు’’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఆయన హీరోగా నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ వేడుక శనివారం రాత్రి గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌లో జరిగింది.