నక్కపల్లి: వ్యవసాయ బోర్లకు ఽవిద్యుత్ సరఫరా కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు ట్రాన్స్‌కో అధికారులు ఎట్టకేలకు విద్యుత్‌లైన్లు ఏర్పాటు పనులు ప్రారంబించారు. మండలంలో గొడిచర్ల గ్రామానికి చెందిన నలుగురు రైతులు తమ పొలాల్లో వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసుకునేందుకు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్‌కోవారికి దరఖాస్తు చేశారు. విద్యుత్‌లైన్లు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలంటే రూ.2.51 లక్షలు డీడీ చెల్లించాలని ట్రాన్సోకో వారు సూచించారు. ఏడాది క్రితం రైతులు ఈ మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించారు. డీడీలు చెల్లించినప్పటికీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు మరోసారి ట్రాన్స్‌కో వారిని సంప్రదించారు. ఏడాది పూర్తవుతున్నా కనెక్షన్ ఇవ్వలేదంటూ అఽధికారులను ప్రశ్నించారు. దీంతో మరో రూ.1.35 లక్షలు చెల్లించాలని నోటీసు ఇచ్చారు. ఈ మొత్తాన్ని కూడా రైతులు చెల్లించారు.
సుమారు నాలుగు లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుండడంతో ‘కనెక్షన్ పేరిట కలెక్షన్’ అనే శీర్షికన బాధితుల గోడు వినిపిస్తూ సాక్షి దినపత్రికలో వార్త కథనం వెలువడింది. డీడీలు చెల్లించినప్పటికీ విద్యుత్‌లైన్లు ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోందంటూ రైతుల ఆవేదనను సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి స్థానిక ట్రాన్స్‌కో వారిని వివరణ కోరారు. తక్షణమే రైతులకు విద్యుత్ సరఫరా ఇవ్వాలని ఆదేశాలు రావడంతో ట్రాన్స్‌కో అధికారులు యుద్ధ ప్రాతిపదికన రైతుల పొలాల్లో ఏర్పాటు చేసిన వదిలేసిన స్తంభాలకు విద్యుత్‌లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టారు. రెండు రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేసి రైతుల వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా ఇవ్వడం జరుగుతుందని ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు.


