● జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్
ఆధ్వర్యంలో ఆందోళన
● మునగపాకలో ఆటోలకు
తాళ్లు కట్టిలాగుతూ వినూత్నంగా నిరసన
మునగపాక: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మండల కేంద్రమైన మునగపాకలో వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన చేశారు. స్థానిక మెయిన్ రోడ్డు నుంచి రిక్షా స్టాండ్ వరకు ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం వల్ల సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతుందని చెప్పారు. నిత్యావసర సరకులు ధరలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మనరాష్ట్రంలోనే పెట్రోల్,డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని తెలిపారు. మరికొద్ది రోజుల్లో మళ్లీ ధరలు పెంచేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఇప్పటికై నా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని లేకుంటే రానున్న రోజుల్లో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు,మాజీ ఎంపీపీ దాసరి గౌరీలక్ష్మి అప్పారావు, పార్టీ నేతలు నరాలశెట్టి సూర్యనారాయణ,కోనపల్లి రామ్మోహనరావు, దిమ్మల శివ,పెంటకోట సారధి, మళ్ల రామజగన్నాథం,ద్వారం జానకీరామ్,భీశెట్టి ఈశ్వరరావు,కాండ్రేగుల జగన్,భీశెట్టి ధనశ్రీను,వెంకట్,నరసింగరావు,నరాలశెట్టి తాతారావు,ఆడారి గణేష్ మళ్ల హేమంత్,పల్లె అప్పలనాయుడు పాల్గొన్నారు.


