మాకవరంపాలెం: పంటలకు సాగు నీరు అందించాల్సిన జలాశయాలు అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ఏళ్ల తరబడి వీటి నుంచి సాగునీరు అందకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. పూడిక పేరుకుపోయి.. కాలువల లైనింగ్ శిథిలమవడంతో ఏటా ఖరీఫ్ సీజన్‌లో రెండు వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు కూడా సాగునీరు అందే పరిస్థితి కానరాకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మాకవరపాలెం మండలంలో మూడు జలాశయాల నిర్వహణను పట్టించుకునే వారు లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం
మూడు రిజర్వాయర్ల గేట్లు, కాలువల మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఒక్కో రిజర్వాయర్‌కు రూ.20 లక్షల చొప్పున ప్రతిపాదించాం. నిధులు రాగానే పనులు చేస్తాం. సర్వేచేసి రిజర్వాయర్లలో ఆక్రమణలను తొలగిస్తాం. ప్రస్తుతం మామిడిపాలెం రిజర్వాయర్ గర్భంలో పూడికను ఉపాధి పథకంలో తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నాం.
– ఆర్.రామన్నపాత్రుడు,
ఏఈ, ఇరిగేషన్, నర్సీపట్నం
పూనిక లేదు.. పూడిక తొలగదు
కూలిన మదుములు.. పాడైన షట్టర్లు
పెరుగుతున్న పూడిక...
కొనసాగుతున్న ఆక్రమణలు
కానరాని మరమ్మతులు
నిరుపయోగంగా మూడు జలాశయాలు


