నేడు బీడీఎల్‌ యూనిట్‌కు శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

నేడు బీడీఎల్‌ యూనిట్‌కు శంకుస్థాపన

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

సాక్షి, అనకాపల్లి: భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ(బీడీఎల్‌) ఆధ్వర్యంలో స్థాపించనున్న రక్షణ తయారీ యూనిట్‌ను ఈ నెల15న శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లాలో మునగపాక మండలంలో టి.సిరసాపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌, ఏపీ సీఎం చంద్రబాబు పుట్టపర్తి నుంచి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. రూ. 489 కోట్ల పెట్టుబడితో ఆధునిక తయారీ అసెంబ్లీ, పరీక్ష(మ్యాట్‌) సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్‌ ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పారిశ్రామిక వేత్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలు ద్వారా అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతమవడంతో పాటు, ఉపాధి అవకాశాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement