పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్‌తో మాట్లాడుతున్న బొడ్డేడ ప్రసాద్, మలసాల భరత్‌కుమార్, జానకీరామరాజు, జాజుల రమేష్
అనకాపల్లి: వివిధ గ్రూపుల్లో వచ్చిన ‘కొంప ముంచుతున్న కొణతాల అల్లుడి తీరు’ పోస్ట్‌ను ఫార్వర్డ్ చేసినందుకు వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మండల కార్యదర్శి బాతు సాయికిరణ్‌పై టీడీపీ నాయకుడు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు సాయికిరణ్‌ను పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్ శనివారం పిలిపించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్, పార్టీ శ్రేణులు పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీఐతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


