సెజ్‌లో లేబర్ కోడ్స్ నిబంధన కాపీలను దహనం చేస్తున్న సీఐటీయూ నాయకులు, కార్మికులు
అచ్యుతాపురం రూరల్: లేబర్ కోడ్స్ నిబంధన కాపీలను సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సెజ్ వద్ద కార్మికులు దహనం చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రొంగలి రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ కారణంగా 29 కార్మిక చట్టాలు రద్దు అయిపోతాయన్నారు. 12 గంటల పాటు పని చేయాలని, దీంతో కార్మికులపై పని భారం అధికమవుతుందని చెప్పారు. లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెజ్ కార్మికులు పాల్గొన్నారు.


