బస్సు మెకానిజంపై డ్రైవర్లకు అవగాహన | - | Sakshi
Sakshi News home page

బస్సు మెకానిజంపై డ్రైవర్లకు అవగాహన

May 13 2026 1:02 AM | Updated on May 13 2026 1:02 AM

ఆర్టీసీ డ్రైవింగ్‌స్కూల్‌ల్లో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న మెకానికల్‌ ఇంజినీర్‌ అశ్విని

అనకాపల్లి : నిరుద్యోగ యువతీ, యువతులకు ఉద్యోగ ఆవకాశాల్లో భాగంగా ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) ఆధ్వర్యంలో 13 వ డ్రైవింగ్‌ స్కూల్‌ బ్యాచ్‌కు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ప్రజారవాణాశాఖ అనకాపల్లి డిపో గ్యారేజ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌ అశ్విని అన్నారు. మంగళవారం డ్రైవర్లకు బస్సు మెకానిక్‌ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రైవర్లకు బస్సు మెకానిజంపై శిక్షణ, అవగహన కల్పించడం వల్ల వారిలో నైపుణ్యాన్ని వెలికితీయవచ్చన్నారు. కొన్ని సందర్భాల్లో బస్సులు మార్గమధ్యంలో ఆగిపోయినపుడు ఈ శిక్షణ వారికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డ్రైవింగ్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ బాపు నాయుడు, డ్రైవింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వి.రమణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement