ఏపీఆర్జేసీలో చేనులపాలెం విద్యార్థినికి 500వ ర్యాంక్‌ | - | Sakshi
Sakshi News home page

ఏపీఆర్జేసీలో చేనులపాలెం విద్యార్థినికి 500వ ర్యాంక్‌

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

దేవరాపల్లి: ఏపీఆర్జేసీ విడుదల చేసిన ఫలితాల్లో చేనులపాలెం విద్యార్థిని కొట్యాడ రాజ మౌనిక 500వ ర్యాంక్‌ సాధించింది. ఈ ఫలితాల్లో దేవరాపల్లిలో ఉచిత కోచింగ్‌ పొందిన 20 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంక్‌లు సాధించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ కోచింగ్‌ తీసుకున్న విద్యార్థినులు టి. ఉష 1,243, ఎస్‌. సంతోషి 1,402వ ర్యాంక్‌లు సాధించారు. 2 వేల లోపు ముగ్గురు, 4 వేల లోపు 8 మంది ర్యాంకులు సాధించిన వారులో ఉన్నారు. వీరిని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, ఉపాధ్యక్షుడు కొరుప్రోలు శ్రీను అభినందించారు. స్థానిక పెద్దలు, ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో 2018 నుంచి ఏటా 150 మంది విద్యార్థులకు ఏపీఆర్జేసీ, పాలిసెట్‌ ఉచిత శిక్షణ అందిస్తున్నామని కె.వి.రమణ, కొరుప్రోలు శ్రీను తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement