యలమంచిలి రూరల్: మునిపాలిటీ పరిధి సోమలింగపాలెం సమీపంలో గోకివాడ ఆనకట్ట వద్ద శారదానదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.ఇక్కడ నదిలో తేలుతూ ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ప్రమాదవశాత్తు నదిలో జారిపడిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుని వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, మృతదేహం స్థితిని బట్టి ప్రమాదం జరిగి ఒకరోజు కావచ్చని ఎస్‌ఐ తెలిపారు.మృతదేహాన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని,మృతుని చిరునామా,ఇతర వివరాల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9440796104 నంబరులో సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.


