పాయకరావుపేట : పట్టణానికి చెందిన యువకుడు తాటి చెట్టు పై నుంచి పడి మృతి చెందినట్టు ఏఎస్‌ఐ గోవిందు తెలిపారు. పట్టణంలో రాజుగారిబీడుకు చెందిన పంజాబీ పవన్ కుమార్ (21) తాటిముంజులు తీయడం కోసం స్థానికంగా గల తాటిచెట్టు ఎక్కి 40 అడుగులు ఎత్తు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితుల సహాయంతో తుని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఏఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.


