వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్
మునగపాక: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. ఈ నెలాఖరులోగా జిల్లా వ్యాప్తంగా అనుబంధ విభాగాల కమిటీలను పూర్తిస్థాయిలో నియమించాలని సూచించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పాలన సాగించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అనుబంధ విభాగాలకు పూర్తిస్థాయిలో కమిటీలు నియమించాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేయాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని చెప్పారు.చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు ప్రభుత్వ పాలనలో జరుగుతున్న విధ్వంసకర పరిస్థితులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఘనంగా ప్రపంచ మాతృ దినోత్సవం
ప్రపంచ మాతృదినోత్సవాన్ని ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాతను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ తదితరులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా పక్షపాతిగా పేరుగాంచారన్నారు.
బొడ్డేడకు ఘన సత్కారం...
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ను పలు అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రసాద్ నాయకత్వంలో అనకాపల్లి జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు.


