ఆర్‌ఏఆర్‌ఎస్‌ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఏఆర్‌ఎస్‌ విద్యార్థుల ప్రతిభ

May 10 2026 8:22 AM | Updated on May 10 2026 8:22 AM

అనకాపల్లి: ఏపీ ఈసెట్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌ పాలిటెక్నిక్‌ విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధించినట్టు పరిశోధన స్థానం ఏడీఆర్‌ సీహెచ్‌.ముకుందరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి ర్యాంక్‌ సిరిపురపు సృజన, రెండో ర్యాంక్‌ జి.రమ్య, నాల్గో ర్యాంక్‌ జవ్వాది దేవి, ఏడో ర్యాంక్‌ అల్లురి దుర్గా సిరి, ఎనిమిదో ర్యాంక్‌ గౌడు సమిత, పదో ర్యాంక్‌ కె.ఎస్‌.కిరణ్‌, 15 ర్యాంక్‌ బి.గాయత్రి, 17వ ర్యాంక్‌ ఎ.రామమధు, 23వ ర్యాంక్‌ ఆర్‌.భవ్యశ్రీ , 29వ ర్యాంక్‌ బి.నైమిష, 30వ ర్యాంక్‌ పి.ధనలక్ష్మి సాధించినట్టు తెలిపారు.

ఈసెట్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌

విభాగంలో ర్యాంకుల పంట

Advertisement
 
Advertisement
Advertisement