కూలీల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు
నర్సీపట్నం: ఉపాధి హామీ పథకానికి నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు కోరారు. నర్సీపట్నం మండలం వేములపూడిలో ఉపాధి పనుల వద్ద కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ నిర్వహణకు 90 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరించాలన్నారు. ముఖ హాజరు సడలించి, వేసవి అలవెన్సుతోపాటు ఐదు కిలో మీటర్ల దాటితే ప్రయాణం చార్జీలు, పనిముట్లు, టెంట్లు సౌకర్యాలు కల్పించాలన్నారు. భవిష్యత్తులో ఉపాధి పని జాబ్‌కార్డుకు 200 రోజులు పని కల్పించాలన్నారు. రోజుకు రూ.600 గిట్టుబాటు కూలి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కె.ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


