నాతవరం : మండలంలో శృంగవరం గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు రావడం జిల్లాకే గర్వకారణమని ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి అన్నారు.ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. శృంగవరం గ్రామ పంచాయతీ గుడ్ గవర్నెన్స్ విభాగంగా జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కిన విషయం తెలిసిందేన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేటలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు చేతుల మీదుగా కేంద్ర మంత్రి రామ్మెహన్‌నాయుడు అధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి సందీప్, శృంగవరం పంచాయతీ కార్యదర్శి వి. శ్రీనివాస్‌రావుకు ఉత్తమ అవార్డు అందుకోవడం సంతోషమన్నారు. అవార్డును అందుకున్న శ్రీనివాస్‌కు ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో మూర్తిబాబుతో పాటు పంచాయతీ కార్యదర్శులు, మండల శాఖ సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు.


