పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆందోళన

May 16 2026 12:57 AM | Updated on May 16 2026 12:57 AM

నర్సీపట్నం: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3 పెంచడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ఆటోకు తాడు కట్టి లాగుతూ వినూత్నంగా నర్సీపట్నంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు అడిగర్ల రాజు మాట్లాడుతూ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు వచ్చిన పది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలపై పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారాలను మోపిందని విమర్శించా రు. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను మధ్య పెట్టి, ఎన్నికలయ్యాక రాక్షస పాలన చేస్తోందని దుయ్యబట్టారు. కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రాయి తీలు ఇస్తున్న ప్రభుత్వం ప్రజలపై ధరల భారాన్ని మోపడం దారుణమన్నారు. ధరలు పెంచే ఉద్దేశంతో ముందుగా పొదుపు చర్యలు పేరుతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజలకు ఉచిత సలహాలు ఇచ్చారన్నారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులపై ధరలు పిడుగు పడిందన్నారు.

చోడవరం: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ చోడవరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటోలను తాళ్లతో లాగుతూ శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోలు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఏ భయం లేదని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారన్నారు. ఎన్నికలు ముగియగానే ధరలు పెంచి సామాన్యుల నెత్తిన భారం మోపడం దారుణమన్నారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి పెంచిన రేట్లు తగ్గించాలని చేయాలని డిమాండు చేశారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు ఎస్‌.వి.నాయుడు, బి.దేవుళ్లు, జి.జాన్‌, బి.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement