పెట్రో, డీజిల్‌ ధరల పెంపు అన్యాయం | - | Sakshi
Sakshi News home page

పెట్రో, డీజిల్‌ ధరల పెంపు అన్యాయం

May 17 2026 12:42 AM | Updated on May 17 2026 12:42 AM

ఎన్నికల హామీలు విస్మరించిన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

పెంచిన ధరలు తగ్గించకుంటే ఆందోళన తప్పదు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్‌

మునగపాక : ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు ఆసన్నమయ్యాయని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో విజయం సాధించేందుకు అమలు కాని హామీలు ఇచ్చి నేడు వాటిని విస్మరించడం విచారకరమన్నారు. పెట్రో, డీజీల్‌ ధరల పెంపును నిరసిస్తూ శనివారం పార్టీ శ్రేణులతో కలిసి మునగపాక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే పెట్రో, డీజిల్‌ ధరలు పెంచమంటూ హామీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేడు వాటిని మరిచిపోయి పేద, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపేలా ధరలు పెంచడం సమంజసం కాదన్నారు. ఈ కారణంగా నిత్యావసర సరకుల ధరలు కూడా ఆకాశాన్నంటే ప్రమాదం ఉందన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడతారన్నారు. ప్రజలంతా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. తక్షణమే పెంచిన పెట్రో.డీజిల్‌ ధరలను తగ్గించాలని, లేకుంటే అన్ని వర్గాల ప్రజలతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు,ఎంపీటీసీలు సూరిశెట్టి రాము,మద్దాల వీరునాయుడు,కాండ్రేగుల జగన్‌,దిమ్మల శివ, మొల్లేటి అచ్చియ్యనాయుడు,కాండ్రేగుల రామప్పారావు,పెంటకోట సారధి,మళ్ల రామజగన్నాఽథం, రమణబాబు పాల్గొన్నారు.

మన రాష్ట్రంలోనే అధికంగా పెంపు...

అనకాపల్లి : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అధికంగా అమలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు. శనివారం రాత్రి స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్‌రాజా ఆధ్వర్యంలో విజయరామరాజుపేట రైల్వే గేటు వద్ద పెట్రోల్‌ బంక్‌ వద్దకు ర్యాలీగా చేరుకుని పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఇంధన ధరల పెంపు వల్ల సామాన్యులపై ఎనలేని భారం పడిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే అదనంగా రూ.10 పెరిగిందన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మన రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఎట్టి పరిస్థితిల్లో పెంచే ప్రసక్తి లేదని ప్రజలకు నమ్మబలికి మరీ ధరలు పెంచడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్‌, ఎంపీపీ గొర్లి సూరిబాబు, పట్టణ, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగుల హైమావతి, పద్మకుమారి, 84వ వార్డు ఇన్‌ఛార్జ్‌ కె.రాఘవ, మండల పార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్‌, కశింకోట ఎంపీపీ లక్ష్మి గున్నయ్యనాయుడు, పార్టీ నాయకులు దేముడుబాబు, కొణతాల మురళీకృష్ణ, గణేష్‌, లక్ష్మి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement