అణచివేతకే అక్రమ కేసులు | - | Sakshi
Sakshi News home page

అణచివేతకే అక్రమ కేసులు

May 14 2026 12:25 AM | Updated on May 14 2026 12:25 AM

వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా

కూటమి ప్రభుత్వం అరాచకాలు

ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారు

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ యువజన నేతల శాంతియుత నిరసన

అనకాపల్లి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ, యువజన విభాగం నాయకులను అణచివేయడమే ధ్యేయంగా పాలన సాగిస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్‌ రాజా, జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్‌ అన్నారు. స్థానిక భీమునిగుమ్మం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కర్నూలు జిల్లాలో పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు బాలుపై అక్రమ కేసును తొలగించాలని బుధవారం జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ప్రభుత్వంలో ఇప్పుడు తప్పు చేసిన నాయకులను, అధికారులను వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం జరిగిందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై జరుగుతున్న అరాచకాలను పార్టీ డిజిటల్‌ బుక్‌లో వారి పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతుందని, తప్పక శిక్ష పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కర్రి రుద్రి, జిల్లాలో వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు జాజుల రమేష్‌, ఆకుల సాయి, పెద్దిశెట్టి శేఖర్‌, పట్టణ అధ్యక్షుడు వేగి త్రినాథ్‌, 82వ వార్డు అధ్యక్షుడు అల్లు త్రినాథ్‌, బుచ్చియ్యపేట మండల అధ్యక్షుడు రవి, పార్టీ సీనియర్‌ నాయకులు బుద్ద జగన్‌, కర్రి రమేష్‌, కొంకి శ్రీరామూర్తి, లక్కోజు రాంబాబు, బొనేల సాయి, సోమిశెట్టి భార్గవ్‌, దొడ్డి కిరణ్‌, నెట్టిమి రామచంద్రరావు, శరగడం హేమంత్‌, దేశెట్టి బసవేశ్వరరావు, నూకేష్‌, నడిశెట్టి గోవింద, రెడ్డి చిన్నా, దొడ్డి హేమంత్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement