నర్సీపట్నం: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని నర్సీపట్నం రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ముందుస్తుగా వచ్చిన సమాచారం మేరకు రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, ఎస్‌ఐ రాజారావు, సిబ్బందితో చింతపల్లి రూట్‌లో నెల్లిమెట్ట జంక్షన్ వద్ద మాటు వేసి పట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన చల్లా గోపి(25), ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా కలిమెల మండలం పపులర్ పంచాయతీకి చెందిన మహాదేబ్ ఖిలా(23)ను అరెస్ట్ చేసినట్ట సీఐ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.12.70 లక్షల విలువైన 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, రెండు సెల్‌ఫోన్లు, రూ.1000 నగదు సీజ్ చేసినట్టు సీఐ చెప్పారు.


