వీడ్కోలు పలుకుతున్న జోనల్ ఉద్యోగులు
అనకాపల్లి టౌన్: స్థానిక జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి పదోన్నతిపై మాతృసంస్థకు బదిలీ అయ్యారు. కర్నూలు జిల్లా బనగాన పల్లె వ్యవవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. గత ఏడాది మే నెలలో ఇక్కడి జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ముఖ్యంగా పారిశుధ్యం మెరుగుపరచడంలో సఫలీ కృతులయ్యారని చెప్పొచ్చు. జోనల్ కార్యాలయంలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డి.లక్ష్మీ తులసి ఇన్‌చార్జ్ కమిషనర్‌గా వ్యవహరించనున్నారు. చక్రవర్తికి జోనల్ ఉద్యోగులు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు.


