● రూ. 34,25,430 జరిమానా విధింపు ● జిల్లా రవాణా శాఖా అధికారి మనోహర్
తుమ్మపాల: ఓవర్ లోడింగ్, టార్పాలిన్‌తో కప్పకుండా సరుకు (ప్రత్యేకించి ఫ్లై యాష్, బొగ్గు)ను రవాణా చేయడంతో పాటు ఇతర నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నట్టు జిల్లా రవాణా శాఖా అధికారి జి.మనోహర్ తెలిపారు. నెల రోజులుగా రాత్రి వేళల్లో ఆకస్మికంగా తనిఖీలు జరిపి, మొత్తం 71 భారీ వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. వీటిలో ఓవర్‌లోడింగ్, సరుకును టార్పాలిన్‌తో సరిగా కప్పకుండా తరలించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు రూ.34,25,430 జరిమానా విధించామన్నారు. 58 వాహనాలను సీజ్ చేసి అపరాధ రుసుం విధించామన్నారు. వాహన యజమానులు, డ్రైవర్లు రహదారి భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాల సూచించారు.


