బీడీఎల్‌ యూనిట్‌కు శంకుస్థాపన | - | Sakshi
Sakshi News home page

బీడీఎల్‌ యూనిట్‌కు శంకుస్థాపన

May 16 2026 12:51 AM | Updated on May 16 2026 12:51 AM

● వర్చువల్‌ పద్ధతిలో భూమిపూజ చేసిన రాజ్‌నాఽఽథ్‌సింగ్‌, చంద్రబాబు

మునగపాక: మండలంలోని టి.సిరసపల్లిలో భారత డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌ )యూనిట్‌ నిర్మాణానికి శుక్రవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్‌,సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌ పద్ధతిలో భూమిపూజ చేశారు. రక్షణ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌ను టి.సిరసపల్లిలో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ విజయకృష్ణన్‌,జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌,నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్షన్‌ యూనిట్‌ సీజీఎం మనోజ్‌కుమార్‌,కంట్రోలర్‌ నేవల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్షన్‌ విజేంద్ర సింగ్‌ నాన్యా,కమోడోర్‌ సంజయ్‌ కపూర్‌,ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిరీష్‌ ఆర్‌.ప్రధాన్‌,ఎన్‌ఎస్‌టీఎల్‌ శాస్త్రవేత్త రాజేశ్వరి,ఎమ్మెల్యేలు సుందరపు విజయకుమార్‌,బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ,పలు కార్పొరేషన్ల చైర్మన్లు,పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయకుమార్‌ మాట్లాడుతూ బీడీఎల్‌ యూనిట్‌ ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.ఈ యూనిట్‌లో తమ ప్రాంతానికి చెందిన వారికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ టి.సిరసపల్లి పంచాయతీ శివారు నారాయుడుపాలెంకు చెందిన గ్రామస్తులు ఎమ్మెల్యే విజయకుమార్‌కు వినతి అందజేశారు.పలు గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement