అనకాపల్లి: జిల్లాలో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 10న విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ జిల్లా ఆపరేషన్ ఎస్‌ఈ జి.ప్రసాద్ శనివారం తెలిపారు. 400కేవీ కాలపాక – ఖమ్మం లైన్‌పై తుప్పు పట్టిన పాత విద్యుత్ టవర్లను మార్చే పనుల నిమిత్తం ఏపీ ట్రాన్స్‌కో ఈ లైన్ క్లియరెన్స్‌ను తీసుకుంటుందని, 220కేవీ బ్రాండిక్స్ కల్పక–1, 2 సర్క్యూట్‌లో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరమ్మతులు నిమిత్తం పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామన్నారు. 220/132/33కేవీ బ్రాండిక్స్ సబ్ స్టేషన్, 33/11కేవీ బ్రాండిక్స్, 33/11కేవీ ఎస్‌ఈజె–1, 2 నుంచి విద్యుత్ పొందే పరిశ్రమలన్నింటికీ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ను నిలుపుదల చేస్తామన్నారు.
అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఉదయం 4 గంటలకు వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. సాధారణ వినియోగదారులు ట్రాన్స్‌కో ప్రత్యామ్నాయ వనరుల ద్వారా విద్యుత్ అందిస్తున్నందున ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. వినియోగదారులు, పారిశ్రామిక వర్గాలు ఈ మార్పుకు సహకరించాలని కోరారు.


