పట్టణంలో డెంగ్యూపై అవగాహన ర్యాలీ
తుమ్మపాల : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ బారిన పడకుండా ఉండగలమని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎం.హైమావతి అన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ దినం పురస్కరించుకొని పట్టణంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద మానవహారం చేసి అవగాహన ర్యాలీ చేపట్టారు. మూడు పద్ధతులు పాటించండి..డెంగ్యూను జయించండి.. ‘పరిశీలించండి.. శుభ్రం చేయండి.. మూతలు పెట్టండి’ అనే నినాదంతో అవగాహన కల్పించారు. జిల్లా మలేరియా అధికారి వరహాలు దొర మాట్లాడుతూ ప్రభుత్వం డెంగ్యూ నివారణకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.


