Live Updates

తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
ట్యాంక్‌బండ్‌పై మంత్రుల నిరసన
- ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న మంత్రులు
- రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ సందర్భంగా.. నిరసనలో పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీతక్క
- నిరసనలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఇతర నేతలు
2025-10-18 13:26:53
బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ పౌర సమాజం అంగీకరిస్తున్న అంశం: మందకృష్ణ
- బీసీ బంద్‌పై స్పందించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ
- బీసీ రిజర్వేషన్ల అంశం బలహీనవర్గాల డిమాండ్: మందకృష్ణ
- బీసీ రిజర్వేషన్లు..తెలంగాణ పౌర సమాజం అంగీకరిస్తున్న అంశం: మందకృష్ణ
- బంద్ సంపూర్ణంతో దేశానికి సంకేతం పంపినట్లయింది : మందకృష్ణ
2025-10-18 13:26:53
మరికాసేపట్లో ట్యాంక్‌బండ్‌కు మంత్రులు
- రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బీసీ సంఘాల బంద్
- బంద్‌ను పర్యవేక్షిస్తున్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి
- మరికాసేపట్లో ట్యాంక్‌బండ్ వద్దకు మంత్రులు, కాంగ్రెస్ కీలక నేతలు
- అంబేద్కర్ విగ్రహం బైఠాయించి నిరసన తెలపనున్న మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
2025-10-18 13:08:49
సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
- బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు సీపీఎం నేతల యత్నం
- దిష్టిబొమ్మ తగలబెడుతుండగా అడ్డుకున్న పోలీసులు
- సీపీఎం నాయకులు, పోలీసుల మధ్య తోపులాట
- సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
2025-10-18 13:08:49
సూర్యాపేటకు రూ.200 కాదు రూ.800!!
- బీసీ బంద్‌తో తెలంగాణలో తిరగని బస్సులు
- సాయంత్రం ఐదుగంటల వరకు బంద్
- మధ్యాహ్నాం నుంచి బస్సులు తిరిగే ఛాన్స్
- బస్టాప్‌లలో పడిగాపులు పడుతున్న ప్రయాణికులు
- మరో దారి లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్న కొందరు ప్రయాణికులు
- ఎల్బీనగర్ నుంచి సాధారణ రోజుల్లో సూర్యాపేటకు రూ.200
- ఇవాళ ఏకంగా రూ.800 డిమాండ్ చేస్తున్న క్యాబ్ డ్రైవర్లు
- విజయవాడకు వీకెండ్‌లో సాధారణంగా రూ.1,000 నుంచి 1,500 మధ్య రేటు
- ఇవాళ ఏకంగా రూ.2,000 డిమాండ్ చేస్తున్న డ్రైవర్లు
- వరంగల్, హనుమకొండ వైపు వెళ్లే వాహనాల కోసం ఉప్పల్, సిద్ధిపేట, కరీంనగర్, గోదావరిఖని, మంచిర్యాల వైపు వెళ్లే వాహనాలతో జేబీఎస్ దగ్గరా అదే పరిస్థితి
- ఆటోవాలా, సెవెన్ సీటర్ వాహనాలు సైతం హైరేంజ్‌లో డిమాండ్
2025-10-18 11:33:40
బంద్‌తో ప్రజలకు ఇబ్బందే, కానీ.. : మంత్రి పొన్నం
- బీసీ సంఘాల బంద్‌పై స్పందించిన రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్
- బంద్ ప్రశాంతంగా జరుగుతోంది.. పాల్గొన్న ప్రజలకు అభినందనలు తెలియజేసిన మంత్రి
- బంద్‌కు మద్దతు ఇచ్చి.. సహకరించాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి
- ప్రజలకు అసౌకర్యమే అయినా.. ఈ ప్రభావం ప్రభుత్వాలపై పడనుంది
- అందుకే బస్సులు బంద్ పెట్టాల్సి వచ్చింది
- తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధపడింది
- రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసన సభలో చట్టం చేసి గవర్నర్‌కు పంపింది
- అక్కడ ఆమోదం నుంచి మొదలుకుని.. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ దాకా వ్యవహారం నడిచింది
- మార్చి 30 నుండి గవర్నర్ దగ్గరకు వెళ్ళిన బిల్లులు ఇంత వరకు ఆమోదం పొందలేదు
- గ్రామ పంచాయతీ ఎన్నికల్లేక.. రెండు సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక ఇబ్బందులు ఉంది
- అందుకే అన్ని రాజకీయ పార్టీల. మద్దతు బిల్లులు పాస్ చేసుకోవడం జరిగింది
- నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటూ వస్తోంది
- కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయాలి
- రాష్ట్రంలో మా బాధ్యత నిర్వహించాం.. ఇక మిగిలింది కేంద్రంలో మీ బాధ్యతే
- రిజర్వేషన్లు అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణకు పేరు తేవాలి
- లేకుంటే తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితి వస్తుంది
- బీసీ రిజర్వేషన్ల అమలు కోసం న్యాయ స్థానాల్లో పోరాటాలు చేస్తాం.. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తాం
- ఏ న్యాయస్థానంలో అయినా మేము వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం
2025-10-18 11:04:51
త్వరలో ప్రధానిని కలుస్తాం: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
- అంబర్‌పేట బీసీ సంఘాల బంద్‌లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
- బంద్ విజయవంతమైంది: మహేష్‌గౌడ్
- ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు: మహేష్‌గౌడ్
- బీసీ రిజర్వేషన్ల కోసం కుల సర్వే చేశాం.. జీవో ఇచ్చాం: మహేష్‌గౌడ్
- మాకు ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదు: మహేష్‌గౌడ్
- బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని త్వరలోనే సీఎం అధ్యక్షతన ప్రధాని మోదీని కలుస్తాం: మహేష్‌గౌడ్
- ప్రభుత్వ పరంగా 42 శాతంతో ఎన్నికలు వెళ్లాలని చూస్తున్నాం: మహేష్‌గౌడ్
- సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తరువాతే స్థానికంపై నిర్ణయం తీసుకుంటాం: మహేష్‌గౌడ్
2025-10-18 11:01:45
దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్తత
- హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బీసీ సంఘాల ధర్నా
- రాస్తారోకో పేరిట ప్రైవేట్ వాహనాల అడ్డగింత
- అడ్డుకోవద్దని వారించిన పోలీసులు
- పోలీసులతో బీసీ సంఘాల నేతల వాగ్వాదం
- బలవంతంగా పక్కకు లాక్కెల్లి.. వాహనాలను వదిలిన పోలీసులు
- బీసీ సంఘాల నేతల నినాదాలతో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం
2025-10-18 10:42:29
బీసీలను నట్టేటా ముంచింది బీజేపీనే: మంత్రి తుమ్మల
- ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న బీసీ సంఘాల బంద్
- సత్తుపల్లి టౌన్‌లో బీసీ బందు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాగమయి
- రాహుల్ గాంధీ మాట నిలబెట్టడానికి సీఎం రేవంత్ బీసీ కుల గణన చేయించారు: మంత్రి తుమ్మల
- బీసీలను నట్టేటా ముంచిన పార్టీ బీజేపీనే: మంత్రి తుమ్మల
- చట్ట సభలో అమోదం తెలిపిన సాంకేతిక కారణాలతో అడ్డు తగులుతున్నారు: మంత్రి తుమ్మల
- ప్రజా క్షేత్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం: మంత్రి తుమ్మల
- బీజేపీ మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధిస్తాం: మంత్రి తుమ్మల
- బీసీలకు అన్యాయం చేస్తున్న బీజేపీకి రానున్న రోజుల్లో ఓటమి తథ్యం: మంత్రి తుమ్మల
2025-10-18 10:42:29
అంబర్‌పేట కాంగ్రెస్ ర్యాలీలో అపశ్రుతి
- బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు
- అంబర్‌పేటలో బీసీ సంఘాలకు మద్దతుగా ర్యాలీ
- పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎమ్మెల్యే దానం, మాజీ ఎంపీ వీహెచ్
- ర్యాలీలో అపశ్రుతి
- కింద పడిపోయిన సీనియర్ నేత వీహెచ్
- క్షేమంగానే ఉన్నారని వెల్లడించిన అనుచరులు
- సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాండ్ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ర్యాలీ
- ఎంజీబీఎస్ వద్ద నిరసనల్లో మంత్రి వాకాటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్
2025-10-18 10:35:09
రిజర్వేషన్ల అంశంలో బీఆర్‌ఎస్‌దీ మోసమే: యూపీఎఫ్
- బీసీల బంద్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం
- పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, యూపీఎఫ్ కన్వీనర్ బొల్లా శివశంకర్
- 78 ఏళ్లుగా బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నారు: బొల్లా శివశంకర్
- కానీ రాజకీయ పార్టీలు బీసీ లను మోసం చేస్తున్నాయి: బొల్లా శివశంకర్
- రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ డ్రామాలు చేస్తోంది: బొల్లా శివశంకర్
- రాష్ట్రపతి వద్ద బిల్లును పాస్ చేయించకుండా బీజేపీ కూడా నాటకాలు ఆడుతోంది: బొల్లా శివశంకర్
- బీఆర్ఎస్ కూడా కుల గణన చేయకుండా మోసం చేసింది: బొల్లా శివశంకర్
- జూబ్లీహిల్స్ లో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ నాటకం చేస్తోంది: బొల్లా శివశంకర్
- ఏ పార్టీ కూడా బీసీలకు మంచి చేయటం లేదు: బొల్లా శివశంకర్
- బీసీలు మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది: బొల్లా శివశంకర్
- దొంగ మాటలు చెప్పే పార్టీలకు బీసీలంతా బుద్ది చెప్పే రోజు వస్తుంది: బొల్లా శివశంకర్
- రిజర్వేషన్ల విషయంలో తుతు మంత్రంగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేయవద్దు: బొల్లా శివశంకర్
- బీసీలు మీ చెప్పు చేతల్లో లేరు. మీ పాపాల లెక్కను మేము రాసుకుంటాం: బొల్లా శివశంకర్
- బీసీలను మోసం చేస్తున్న అన్ని పార్టీలకు రాబోయే రోజుల్లో బుద్ది చెబుతాం: బొల్లా శివశంకర్
- బీసీల పట్ల మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం: బొల్లా శివశంకర్
2025-10-18 10:14:05
స్థానిక ఎన్నికకు తొందరెందుకు?: కవిత
- బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం
- పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, యూపీఎఫ్, తెలంగాణ జాగృతి నాయకులు
- గంటపాటు ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం
- ప్రత్యేక ఆకర్షణగా కవిత కొడుకు ఆదిత్య
- బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు: కవిత
- రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించటం నవ్వులాటగా ఉంది: కవిత
- దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీలు బంద్‌కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయి: కవిత
- హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారు: కవిత
- బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారు: కవిత
- స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను మోసం చేస్తున్నారు: కవిత
- తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతాం: కవిత
- తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలి: కవిత
- యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జాగృతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది: కవిత
- బీసీ బంద్ ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా: కవిత
- బీసీల రిజర్వేషన్లు అమలు చేసేలా టెక్నికల్ గా ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించటం లేదు: కవిత
- ఈ కారణంగానే బీసీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పులు వస్తున్నాయి: కవిత
- కాంగ్రెస్ పార్టీ రూల్స్ ప్రకారం జనగణన నిర్వహించలేదు: కవిత
- జీవో 9 విషయంలో కూడా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు. అందుకే కోర్టు జీవోను కొట్టేసింది: కవిత
- బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదు: కవిత
- ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సినంత తొందర ఏముంది?: కవిత
- మహారాష్ట్ర, తమిళనాడు లో 5 ఏళ్ల వరకు ఎన్నికలు జరగలేదు: కవిత
- బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి: కవిత
- సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బంది పెడుతోంది: కవిత
- బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు చిత్తశుద్ధి పనిచేయాలని నేను డిమాండ్ చేస్తున్నా: కవిత
2025-10-18 10:14:05
ప్రశాంతంగా బంద్
- ప్రశాంతంగా కొనసాగుతున్న తెలంగాణ బంద్
- హైదరాబాద్‌లో ప్రైవేట్ వాహనాలు తప్ప కనిపించని ఆర్టీసీ బస్సులు
- నగరంలో తెరుచుకొని ఉన్న పెట్రోల్ బంక్‌లు
- ఆటోలు, ర్యాపిడో వాహనాలకు భారీగా డిమాండ్
2025-10-18 10:14:05
ఆ రెండు పార్టీలది డ్రామానే
- బీసీ సంఘాల బంద్‌కు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు
- తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోంది: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- కాంగ్రెస్ పార్టీకి.. ప్రభుత్వానికి బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైంది: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలుతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా పోయింధి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్యపెట్టారని చూశారు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- కానీ బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- బీసీల రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- చెల్లెని జీవోలను, ఆర్డినెన్స్‌ను విడుదల చేశారు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- సమస్యలు పరిష్కరించే నాధుడే కరువయ్యాడు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- కామారెడ్డి డిక్లరేషన్ బూటకం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
2025-10-18 10:06:27
తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేయాలి: ఈటల
- జేబీఎస్ వద్ద బంద్‌లో పాల్గొన్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
- న్యాయం దక్కాలి.. 42 శాతం రిజర్వేషన్లు కావాలి అంటూ బీజేపీ శ్రేణుల నినాదాలు
- బీసీలకు అన్యాయం జరిగింది: ఈటల
- 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేవరకు ఐక్యంగా పోరాడాలి: ఈటల
- తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేయాలి: ఈటల
2025-10-18 09:23:22
అవాంఛనీయ ఘటనలను సహించం: పోలీసుల వార్నింగ్
- తెలంగాణ బీసీ సంఘాల బంద్‌కు అన్నిపార్టీల మద్దతు
- బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బంద్‌కు పిలుపు
- ఇప్పటికే రోడ్లు, హైవేలు, బస్సు డిపోలు ముందు పలువురు నేతల నిరసనలు
- సాయంత్రం 5గం. వరకు బంద్ ఉంటుందన్న బీసీ సంఘాలు
- శాంతియుతంగా బంద్ నిర్వహించుకోవాలన్న తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి
- బంద్ నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరింపు
- అవాంఛనీయ ఘటనలు జరిగితే ఉపేక్షించబోమని హెచ్చరిక
2025-10-18 08:17:48
స్తంభించిన తెలంగాణ
- తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్ ఫర్ జస్టిస్
- బీసీ సంఘాల బంద్‌తో స్తంభించిన తెలంగాణ
- రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలకే పరిమితమైన బస్సులు
- బస్సులు బయటకు రాకుండా డిపోల ముందు బైఠాయించిన బీసీ సంఘాల నేతలు, రాజకీయ నేతలు
- రోడ్లపైకి చేరి వాహనాలను అడ్డుకుంటున్న పలు పార్టీల నేతలు
- తెరుచుకోని దుకాణాలు
- పలు చోట్ల ఆఫీసులకు సెలవులు.. వర్క్‌ఫ్రమ్ హోం వెసులుబాటు
- స్కూల్స్, కాలేజీలకు సెలవు.. పరీక్షలు వాయిదా
- ఎక్కడిక్కడే ఆగిపోయిన రవాణా వ్యవస్థ
- ఉప్పల్, ఆరాంఘడ్, జేబీఎస్, పటాన్‌చెరు-మియాపూర్, ఎల్బీనగర్ వద్ద ప్రయాణికుల పడిగాపులు
- ఇదే అదనుగా అడ్డగోలు డిమాండ్ చేస్తున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లు
- బీసీ బంద్‌కు అన్ని వర్గాల నుంచి మద్దతు
- ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపు
2025-10-18 08:14:00
ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భారీగా పోలీసుల మోహరింపు
- హైదరాబాద్, శివారుల్లో కొనసాగుతున్న బీసీ సంఘాల నిరసనలు
- బస్ భవన్ ముట్టడికి సిద్ధమైన బీసీ నేతలు
- ముందస్తు సమాచారంతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భారీగా పోలీసుల మోహరింపు
2025-10-18 08:14:00
రంగంలోకి దిగిన బీఆర్‌ఎస్ నేతలు
- నేడు బీసీ సంఘాల జేఏసీ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీఆర్‌ఎస్
- కాసేపట్లో తెలంగాణ భవన్‌కు పార్టీ బీసీ నేతలు
- తెలంగాణ భవన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి బంద్‌లో పాల్గొననున్న నేతలు
- మండల, జిల్లా స్థాయిలో బంద్ లో పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన అధిష్టానం
- మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపో ముందు ధర్నాలో పాల్గొన్న శ్రీనివాస్‌గౌడ్
2025-10-18 08:14:00
బంద్ అదనుగా దోపిడీ!
- తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బీసీ సంఘాల బంద్
- నిలిచిపోయిన ప్రజా రవాణా వ్యవస్థ
- ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు
- ఇదే అదనుగా అడ్డగోలుగా డిమాండ్ చేస్తున్న దిగిన ఆటో, క్యాబ్ డ్రైవర్లు
2025-10-18 07:46:40
ఎక్కడికక్కడే నిరసనలు
- ఉదయం నుంచి తెరుచుకోని షాపులు
- వ్యాపార, వాణిజ్య సంస్థల స్వచ్చంద బంద్
- పెట్రోల్ బంకులూ బంద్ పాటించాలని బీసీ సంఘాల విజ్ఞప్తి
- ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు
- అంబులెన్సులు, ఆసుపత్రులు, ఇతర అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు
- ఎక్కడిక్కడే బంద్‌ను పాటించి విజయవంతం చేయాలని బీసీ సంఘాల ఐక్యకార్యాచరణ సంఘం వర్కింగ్ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపు
2025-10-18 07:10:56
బీసీల ఆకాంక్ష ఢిల్లీకి వినపడేలా..
- ఆర్టీసీ బస్సులు బయటకు రానీయకుండా డిపోల ముందు ధర్నా
- మరికాసేపట్లో మొదలుకానున్న జాతీయ రహదారుల దిగ్బంధం,
- టోల్‌ప్లాజాల వద్ద నిరసనలు తెలపనున్న బీసీ సంఘాలు
- ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు పిలుపు
- బీసీల ఆకాంక్ష ఢిల్లీకి వినిపించేలా బంద్ నిర్వహిస్తామంటున్న బీసీ సంఘాలు
2025-10-18 07:10:56
బంద్‌కు అన్ని వర్గాల మద్దతు
- బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ సంఘాల బంద్
- అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటించాలని పిలుపు
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతోపాటు ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించగా
- బంద్‌కు మేధావులు సంఘీభావం
2025-10-18 07:10:56
ప్రయాణికుల అవస్థలు
- బంద్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
- అర్ధరాత్రి నుంచి డిపోల నుంచి కదలని ఒక్క బస్సు
- ఉదయం నుంచే డిపోల ఎదుట బీసీ సంఘాలు, పలు పార్టీల నేతల నిరసనలు
- ఆఫీసులు, దూర ప్రయాణాలు చేసే వాళ్లు తప్పని ఇక్కట్లు
- పండుగ పూట ప్రయాణాలు చేసేవాళ్లకు చుక్కలు
- శనివారం కావడం, పైగా దీపావళి పండుగ ఉండడంతో ప్రయాణాలకు ముందస్తు ఏర్పాట్లు
- బంద్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వైనం
- రైల్వే స్టేషన్ల వైపు చూస్తున్న పలువురు
- స్టేషన్ల దాకా వాహనాలు లేక ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు
2025-10-18 07:01:06
ఎంజీబీఎస్ నుంచి బయటకు రాని ఒక్క బస్సు
- ఎంజీబీఎస్ నుంచి బయటకు రాని బస్సులు
- బస్టాండ్ వద్ద నిరసన తెలుపుతున్న బీసీ సంఘాలు
2025-10-18 07:01:06
క్షేత్రస్థాయి విజయానికి పార్టీల కృషి
- రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న బీసీ సంఘాల బంద్
- బంద్‌కు అన్ని పార్టీల మద్దతు
- ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్న బంద్ ఇదే
- బంద్‌లో పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలుపు
- బంద్‌ను సక్సెస్ చేయాలని బలంగా భావిస్తున్న బీఆర్‌ఎస్, బీజేపీ
- వామపక్షాలతో తెలంగాణ జాగృతి, ఇతరత్రా పార్టీలు, వర్గాల మద్దతు కూడా
2025-10-18 06:48:52
అందుకే బీసీ సంఘాల్లో తీవ్ర అసంతృప్తి

- బీసీ రిజర్వేషన్ల సాధనలో సంఘాల పోరాటం
- స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రభుత్వం
- అసెంబ్లీలో ప్రత్యేక చట్టం.. ఆపై కేంద్రానికి పంపిన వైనం
- మరోవైపు ఆర్డినెన్స్ జారీ చేసినా.. గవర్నర్ నుంచి నో ఆమోదం
- బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- అయితే పలువురి అభ్యంతరాల నడుమ.. హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి
2025-10-18 06:48:52
ఆగిపోయిన బస్సులు

- బస్సులు బయటకు రాకుండా ఆర్డీసీ డిపోల ముందు బైఠాయించిన జేఏసీలు
- కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన బంద్
- 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, 9వ షెడ్యూల్ చేర్చి చట్టసవరణ చేయాలంటూ నినాదాలు
- హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ డిపోలకే పరిమితమైన బస్సులు
- బీసీ సంఘాలకు అన్ని పార్టీల మద్దతు
- పలు డిపోల వద్ద బీసీ సంఘాలతో కలిసి ధర్నాలో పాల్గొంటున్న పార్టీల నేతలు, కార్యకర్తలు
- బైక్, ట్యాక్సీ సేవలకు మాత్రం మినహాయింపు
2025-10-18 06:32:52
బంద్ నుంచి మినహాయింపు వాటికి మాత్రమే

- నేడు తెలంగాణ అంతటా బంద్
- కొనసాగుతున్న బీసీ సంఘాల బంద్
- బంద్‌కు దాదాపు అన్ని వర్గాల నుంచి మద్దతు
- మూతపడనున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు
- బంద్ నుంచి అతవ్యసర సేవలకు మాత్రం మినహాయించు
- శాంతి యుతంగా జరుపుకోవాలన్న పోలీసులు
2025-10-18 06:32:52
ప్రారంభమైన బంద్ ఫర్ జస్టిస్

- తెలంగాణలో కొనసాగుతున్న బీసీ సంఘాల బంద్
- ఉదయం 4గం.కే మొదలైన బంద్
- బీసీ రిజర్వేషన్లు కేంద్రం ఆమోదించాలంటూ బంద్‌కు పిలుపు ఇచ్చిన బీసీ సంఘాలు
- తెలంగాణలోని అన్నిపార్టీల మద్దతు
- బంద్ ఫర్ జస్టిస్(Bandh For Justice) పేరిట రాష్ట్రవ్యాప్త బంద్
2025-10-18 05:32:52
Advertisement