
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్‌ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత కొంతకాలంగా పార్టీ లైన్ దాటి ఆమె వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కవిత వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలుగుతోందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
కవిత ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నష్టం కలిగించే రీతిలోఉన్నందున బీఆర్‌ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించిందని, తక్షణమే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ప్రధాన కార్యదర్శి టీ రవీందర్‌రావు, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ మెంబర్ సోమ భరత్‌కుమార్ పేరిట లేఖ విడుదలైంది.
బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల నుంచి కవితకు పార్టీకి మధ్య గ్యాప్ మొదలైంది. కేసీఆర్ ప్రసంగంపై ఆమె బహిరంగ లేఖ విడుదల చేయడం కలకలం రేపింది. అటుపై సోదరుడు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైనా ఆమె అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు. ఇక.. లిల్లీపుట్ అంటూ మాజీమంత్రి జగదీష్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా.. హరీష్‌రావు, సంతోష్‌రావులను ఉద్దేశించి తీవ్ర ఆరోపణలే చేశారామె.

పార్టీ MLC శ్రీమతి కె. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్‌ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది.
పార్టీ అధ్యక్షులు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు శ్రీమతి కె.… pic.twitter.com/iTSWON3irq— BRS Party (@BRSparty) September 2, 2025
