
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు నేడు(జులై 24). ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కోలాహలం నెలకొంది. పార్టీ నేతలతో పాటు రాజకీయ, సినీ ప్రముఖలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా.. ఆయన సోదరి, ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘అన్నయ్యా.. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు మరెన్నో చేసుకోవాలి’’ అని పోస్ట్ చేశారామె. కవితకు, కేటీఆర్‌కు మధ్య గతకొంతకాలంగా నెలకొన్న గ్యాప్ సంగతి తెలిసిందే.
తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖలో.. కేవలం ట్వీట్లు చేయడంతోనే ఆగిపోకూడదంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ఆమె విమర్శలులు గుప్పించారు. అదే సమయంలో పార్టీ విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదంటూ కవితకు కేటీఆర్ చురకలంటించారు. ఈ క్రమంలో సోదరుడి పుట్టినరోజు సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Annayya
Many Happy Returns of the day!! @KTRBRS— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 24, 2025
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు సీఎంవో అధికారిక ఖాతా ద్వారా తెలియజేసింది.
సిరిసిల్ల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని… pic.twitter.com/Bu7MCvtg7S
— Telangana CMO (@TelanganaCMO) July 24, 2025
కేటీఆర్ ఫ్లెక్సీల తొలగింపు
కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఫ్లెక్సీల ఏర్పాటు చేశాయి. అయితే జీహెచ్‌ఎంసీ వాటిని తొలగిస్తోంది. ఈ చర్యపై బీఆర్‌ఎస్ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
ఇదీ చదవండి: నాతో పెట్టుకోవద్దు.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డ కవిత!