కేసీఆర్‌కు సమకాలికుడినే.. చేతులు కట్టుకోను | Jeevan Reddy Counter To CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు సమకాలికుడినే.. చేతులు కట్టుకోను

Apr 15 2026 1:10 PM | Updated on Apr 15 2026 1:31 PM

Jeevan Reddy Counter To CM Revanth Reddy

సాక్షి, జగిత్యాల: తనపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. కేసీఆర్‌ ముందు చేతులు కట్టుకుని నిలబడతానన్న వ్యాఖ్యలను బుధవారం ఆయన ఖండించారు.  

‘‘కేసీఆర్‌ ముందు నేను చేతులు కట్టుకుని నిలబడతానంటూ సీఎం రేవంత్‌ మాట్లాడడం సరికాదు. విభేదాల పేరుతో వ్యక్తిగతంగా కించపరచడం సరికాదు. నేను ఎవరి ముందు చేతుల కట్టుకుని నిలబడను. కేసీఆర్‌కు నేను సమకాలికుడినే. ఇద్దరం కలిసే రాజకీయ ప్రయాణం చేశాం. 

..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ పాత్ర గొప్పది. ఆయన సమాజాన్ని గౌరవించే నాయకుడు. వ్యక్తిని గౌరవించే సంస్కారం నాది. నేను ఎవరి ముందు చేతులు కట్టుకోను. రాజకీయాల్లో నాకు ఆత్మగౌరవం ముఖ్యం. కాంగ్రెస్‌ పార్టీలో అది దెబ్బతింది కాబట్టే బయటకు వచ్చా అని జీవన్‌రెడ్డి చెప్పారు.

 

Advertisement
 
Advertisement
Advertisement