ఇలా మాట్లాడితే నాకు అహంకారం అంటారు: కేటీఆర్‌ | KTR Speech At Telangana Bhavan Deeksha Divas 2025 | Sakshi
Sakshi News home page

ఇలా మాట్లాడితే నాకు అహంకారం అంటారు: కేటీఆర్‌

Nov 29 2025 2:15 PM | Updated on Nov 29 2025 3:16 PM

KTR Speech At Telangana Bhavan Deeksha Divas 2025

సాక్షి, హైదరాబాద్‌: గోడకు వేలాడదిస్తే తుపాకీ కూడ మౌనంగానే ఉంటుందని.. ఎదురుదాడి విషయంలో కేసీఆర్‌ వైఖరి కూడా అలాగే ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన దీక్షా దివస్‌(Diksha Divas) కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.   

‘‘కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. పీసీసీ చీఫ్‌ కేసీఆర్ దీక్ష దొంగ దీక్ష అని మాట్లాడుతున్నాడు. కొందరు అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. ఒక సింహం తన కథ తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పే కథనే నిజం అనుకుంటారు.. 

.. కొందరు మూర్ఖులు కేసీఆర్ కనిపించడం లేదని అంటున్నారు. గోడకు వేలాడదిస్తే తుపాకీ కూడ మౌనంగానే ఉంటుంది. కేసీఆర్‌ ఎప్పుడు రావాలో అప్పుడే బయటకు వస్తారు. ఎదురుదాడి ఎలా చెయ్యాలో కేసీఆర్‌కు  తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. నాయకుడిని నాయకుడే అంటారు, అర్భకుడిని అర్బకుడే అంటారు. ఇలా మాట్లాడితే నాకు అహంకారం అంటారు. నేను ఇలానే మాట్లాడుతాను.. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి’’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement