సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్ ఐదు ముక్కలవుతుందని అన్నారాయన. అంతేకాదు.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన స్థాయికి తగ్గ వ్యక్తి కాదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అదనపు సమాచారం అందాల్సి ఉంది.