మైనింగ్ స్కాం కేసులో కీలక పరిణామం | CID Registers Case In Telangana Mining Scam After Vigilance Report Flags Irregularities In Leasing And Permissions | Sakshi
Sakshi News home page

మైనింగ్ స్కాం కేసులో కీలక పరిణామం

May 30 2026 11:07 AM | Updated on May 30 2026 11:44 AM

CID registers case in Telangana mining scam

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మైనింగ్ కుంభకోణాల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.

గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ లీజులు, అనుమతులు, తవ్వకాల ప్రక్రియల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వెయిరీకి ఆదేశించింది. ఈ క్రమంలో విజిలెన్స్ సంస్థ సమగ్ర పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.

విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. దీంతో ఇకపై సీఐడీ ఈ ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరపనుంది. సంబంధిత అధికారులు, అప్పటి నిర్ణయాధికారులు, లీజుదారుల పాత్రపై విచారణ కొనసాగనుంది. అవసరమైతే కీలక పత్రాలు, ఫైళ్లు, అనుమతి రికార్డులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని సమాచారం.

ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై వరుసగా దర్యాప్తు ఆదేశాలు వెలువడుతున్న నేపథ్యంలో ఇది మరింత రాజకీయ ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement