మహేష్‌గౌడ్‌ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి: హరీష్‌రావు | Harish Rao Demands Public Apology From Mahesh Goud | Sakshi
Sakshi News home page

మహేష్‌గౌడ్‌ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి: హరీష్‌రావు

Aug 4 2026 11:36 PM | Updated on Aug 4 2026 11:36 PM

Harish Rao Demands Public Apology From Mahesh Goud

తెలంగాణ: టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌.. మాజీ మంత్రి హరీష్‌రావు క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ.హరీష్‌రావు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌కు లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన క్షుద్రపూజల ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొంటూ, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు.

అంతేకాకుండా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మహేష్‌గౌడ్‌ను హరీష్‌రావు కోరారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన హరీష్‌రావు.. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement