పార్టీ మార్పు.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు | Mallareddy Reject Party Change Claims | Sakshi
Sakshi News home page

పార్టీ మార్పు.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు

Apr 29 2026 1:35 PM | Updated on Apr 29 2026 3:39 PM

Mallareddy Reject Party Change Claims

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ మారబోతున్నారనే ప్రచారంపై మేడ్చల్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తానింకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పారాయన. బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనకు మీడియా నుంచి ఈ ప్రశ్న ఎదురైంది..   

మోదీని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదు. నేను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నాను. వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

మల్లారెడ్డి కుటుంబం ఇటీవల ప్రధాని మోదీని కలిసింది. అంతకు కొన్నిరోజులు ముందే.. ఆయన కోడలు ప్రీతిరెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను పొగుడుతూ కామెంట్లు చేశారు. ఆ వెంటనే ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. దీంతో పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే.. 

తాము మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రారంభించబోయే ఏఐ క్యాంపస్‌ ప్రారంభోత్సవం కోసం ప్రధానిని కలిశామని.. బీజేపీ మాత్రమే కాదు అన్ని పార్టీల నేతలనూ కలిసి ఆహ్వానిస్తామని ప్రీతిరెడ్డి తర్వాత క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు తనకు ఇంకా టైం ఉందన్న ఆమె.. బీఆర్‌ఎస్‌ అంటే తమ కుటుంబానికి గౌరవం ఉందంటూ వ్యాఖ్యానించారు.

ఏ పార్టీలో చేరుతున్నారు? మల్లారెడ్డి ఫుల్ క్లారిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement