లోకేష్ చిన్నపిల్లోడు.. అతని వ్యాఖ్యలపై స్పందించను: కోమటిరెడ్డి | Komatireddy Venkat Reddy reacts On Nara Lokesh Banakacherla Comments | Sakshi
Sakshi News home page

లోకేష్ చిన్నపిల్లోడు.. అతని వ్యాఖ్యలపై స్పందించను: కోమటిరెడ్డి

Aug 4 2025 11:13 AM | Updated on Aug 4 2025 11:45 AM

Komatireddy Venkat Reddy reacts On Nara Lokesh Banakacherla Comments

సాక్షి, నల్లగొండ: తెలంగాణ నీటి ప్రాజెక్టుల గురించి ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి స్పందించారు. సోమవారం నల్లగొండ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి కోమటిరెడి మాట్లాడారు.

‘‘నా ఫోన్ ట్యాపింగ్ చేశారని అంటున్నారు. కానీ, ఎప్పటినుంచో నా నంబర్ అదే ఉంది. దాన్నే కొనసాగిస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని అందరికీ తెలుసు. ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకున్నాం. కమిషన్ నివేదికపై కేబినేటలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఏం జరగాలో అదే జరుగుతుంది. 

బనకచర్ల చాప్టర్ క్లోజ్‌.  బనకచర్లని నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతాం. అవసరమైతే కేంద్రంతో కొట్లాడుతాం. లోకేష్ లాంటి చిన్నపిల్లోడి వ్యాఖ్యలపై నేను మాట్లాడను. డిండి ప్రాజెక్టు టెండర్ ప్రక్రియ పూర్తి అయింది. జిల్లా ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలకు లైనింగ్ ఏడాదిలోనే పూర్తిచేస్తాం అని తెలిపారాయన.

రైతు భరోసా వంద ఎకరాలు ఉన్నవారికి కూడా ఇచ్చాం. ఎంజీ యూనివర్శిటీలో నూతన బిల్డింగులను నిర్మిస్తాం. నార్కెట్‌పల్లి పెద్ద చెరువును వేణుగోపాలస్వామి పేరుతో మినీ ట్యాంక్ బండ్‌గా మారుస్తాం. క్యాంపు కార్యాలయానికి ఇందిరా భవన్ గా నామకరణం చేస్తున్నాం.

బీఆర్ఎస్ లో ఐదు గ్రూపులు ఉన్నాయి. కేసీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్, కేటీఆర్ గ్రూపులు నడుపుతున్నారు. బీసీలకు కవితకు ఏం సంబంధం. గత పదేళ్లు ఆమెకు బీసీలు గుర్తుకురాలేదా?. బీఆర్ఎస్ పార్టీ అనేదే భవిష్యత్తులో ఉండదు. దాని గురించి నేను మాట్లాడను అని కోమటిరెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement