తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశాలు! | Telangana Assembly Winter Sessions 2025 Latest News, Live Updates, Key Topics And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

Telangana Assembly Updates: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అప్‌డేట్స్‌

Dec 29 2025 9:12 AM | Updated on Dec 29 2025 11:25 AM

Telangana Assembly Last Session 2025 Latest News

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. అప్‌డేట్స్‌

అధికార-ప్రతిపక్షం నడుమ బాంబుల గొడవ

  • తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షం నడుమ బాంబుల గొడవ

  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై దుమారం

  • మేడిగడ్డ ప్రాజెక్టును బాంబులు పెట్టి పేల్చేశారు: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

  • మేడిగడ్డ మాదిరిగానే తనుగుల చెక్‌ డ్యామ్‌ను కూడా బాంబుతో పేల్చేశారు: కౌశిక్‌రెడ్డి

  • కౌశిక్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సభ్యుల తీవ్ర అభ్యంతరం

  • కౌశిక్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాగరాజు కౌంటర్‌ 

  • బాంబులు పెట్టి పేల్చారని అనడం ఏంటి?.: ఎమ్మెల్యే నాగరాజు 

  • కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి: ఎమ్మెల్యే నాగరాజు

  • సభలో కాసేపు ఇరు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 

  • కాళేశ్వరం ప్రాజెక్ట్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది.
  • రెండేళ్ల పాలనలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్, అధికారులు సమీక్ష చేయలేదు.
  • సిద్దిపేట ఇరిగేషన్ ను మంత్రి పట్టించుకోవడం లేదు.
  • మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ పై లక్షల ఎకరాలు ఆయకట్టు ఆధారపడి ఉంది.
  • ప్రభుత్వం సిద్దిపేట జిల్లా ఇరిగేషన్ పై సమీక్ష చేయాలి

ఆ ఎమ్మెల్యేలు అలా.. 

  • ట్రెజరీ బెంచీల వైపు కూర్చున్న ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలు
  • ట్రెజరీ బెంచీల వైపు కూర్చున్న అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి
  • ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు ఇటీవల ప్రకటించిన స్పీకర్
  • ట్రెజరీ బెంచీలవైపు కూర్చున్న  ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
  • ఫిరాయింపు ఎమ్మెల్యేలు ట్రెజరీ బెంచీలలో కూర్చోవడాన్ని గతంలో తప్పు పట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

భాషపై బీజేపీ అభ్యంతరం.. మంత్రి వివరణ

  • వెంకటరమణ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే @ అసెంబ్లీ
  • దిగజారి భాష మాట్లాడటం సరికాదు
  • ఒకరిని మించి మరొకరు మాట్లాడితే ఎలా ?
  • ఒకరు తప్పు మాట్లాడితే మరొకరు సరిచేయాలి
  • బూతు లు మాట్లాడటమే రాజకీయమా ?
  • నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ వరకు మంత్రులు కూడా దిగజారి మాట్లాడుతున్నారు
  • హైదరాబాద్ వరల్డ్ క్లాస్ అంటున్నారు.. మాటలు మాత్రం థర్డ్ క్లాస్ గా ఉంటున్నాయి

శ్రీధర్ బాబు, రాష్ట్ర మంత్రి వివరణ.. 

  • మాకు భేషజాలు లేవు
  • వెంకటరమణ రెడ్డి తన పార్టీ నేతలకు సూచించాలి
  • గౌరవ సభ్యుల గౌరవం కాపాడే విధంగా చూస్తాం

శాసనసభలో ఇంట్రెస్టింగ్‌ సీన్‌

  • అసెంబ్లీలో కేసీఆర్‌, సీఎం రేవంత్‌ రెడ్డి కరచలనం
  • ప్రతిపక్ష నేత దగ్గరకు వెళ్లి మరీ షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన సీఎం, మంత్రులు
  • ఆశీర్వాదం తీసుకున్న జూబ్లీహిల్స్‌ నూతన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నవీన్‌ యాదవ్‌
  • వందేమాతరం తర్వాత సభలో కనిపించని ప్రతిపక్ష నేత
  • అసెంబ్లీ అటెండెన్స్‌ రిజిస్ట్రర్‌లో సంతకం చేసిన కేసీఆర్‌
  • అనంతరం.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన గులాబీ బాస్‌
  • ఇటు ఫిరాయింపుల నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్‌ సీన్‌
  • అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వెనక కూర్చున్న రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
  • పార్టీ ఫిరాయింపు కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ప్రకటించిన స్పీకర్


తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
దివంగత నేతలకు సంతాపం తెలిపిన ఉభయ సభలు
అసెంబ్లీలో జీరో అవర్‌ ప్రారంభం

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

  • తెలంగాణ శాసన సభ సమావేశాలు ప్రారంభం

  • హాజరైన సీఎం రేవంత్‌, ప్రతిపక్ష నేత కేసీఆర్‌

  • దివంగత నేతలకు సంతాప తీర్మానం చదివి వినిపిస్తున్న గడ్డం ప్రసాద్‌

  • ఇటు తెలంగాణ శాసన మండలి సమావేశాలు ప్రారంభం

  • దివంగత నేతలకు మండలిలో సంతాపం

  • సంతాప తీర్మానం చదివి వినిపిస్తున్న చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌

అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

  • మరికాసేపట్లో మొదలుకానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

  • అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌, మంత్రులు

కేసీఆర్‌.. అటెండెన్స్‌కే పరిమితం కావొద్దు: కాంగ్రెస్‌

  • ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కీలక వ్యాఖ్యలు

  • కేసీఆర్‌ కేవలం అటెండెన్స్‌కే పరిమితం కావొద్దు

  • హరీష్‌, కేటీఆర్‌ మధ్య గొడవలు పెరిగాయని.. అందుకే కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తున్నారని పరజలు అనుకుంటున్నారు

  • అందుకే అసెంబ్లీలో జరిగే చర్చలోనూ కేసీఆర్‌ పాల్గొనాలి

అసెంబ్లీలో కేసీఆర్‌ భేటీ

  • మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

  • అసెంబ్లీకి చేరుకున్న బీఆర్‌ఎస్‌ అధినేత

  • బీఆర్‌ఎస్‌ఎల్పీలో ఎమ్మెల్యేలతో సమావేశం

ఫిరాయింపులపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

  • మీడియా చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

  • ఏ పార్టీలో ఉన్నారో ఫిరాయింపు ఎమ్మెల్యే లు చెప్పుకోలేకపోతున్నారు

  • ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ డోర్స్‌ క్లోజ్‌

  • ఆ స్థానంలో ఇక కొత్తవారికి అవకాశం

  • గ్రౌండ్‌లో బీఆర్‌ఎస్‌కు మంచి పట్టు ఉంది

  • సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎదురు దెబ్బ తగిలింది

  • బీఆర్‌ఎస్‌కు 80 శాతం అనుకూల ఫలితాలు వచ్చాయి

  • కాంగ్రెస్‌కు అందుకే భయం మొదలింది.. మున్సిపల్ ఎన్నికలు పెడుతలేరు

  • మున్సిపల్‌ ఎన్నికలకల్లా నన్ను లేకుండా చేయాలని కాంగ్రెస్‌ సర్కార్‌ కుట్ర చేస్తోంది 

  • నేను లోపలకు పోయినా.. బయట పార్టీ చూసుకుంటది

  • నేను ఎవరికీ.. దేనికి భయపడను

అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

  • అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం

  • అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన మాజీ సర్పంచ్‌లు

  • పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్‌

  • గన్‌ పార్క్‌ వద్ద అదుపులో తీసుకున్న పోలీసులు

అసెంబ్లీకి బయల్దేరిన కేసీఆర్‌!

  • మరికాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం
  • అసెంబ్లీకి బయల్దేరిన బీఆర్‌ఎస్‌ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్‌
  • నందినగర్‌ నివాసం నుంచి బయల్దేరిన కాన్వాయ్‌
  • కేసీఆర్‌ వెంట ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి

అసెంబ్లీ వద్ద 1000 మంది పోలీసులు

  • తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులు
  • అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటుచేసిన పోలీసులు..
  • దాదాపు 1,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు..
  • ఈరోజు మాజీ సర్పంచ్ లు తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ముట్టడికి పిలుపు
  • దీంతో ముందస్తుగా మాజీ సర్పంచ్ అరెస్టు చేసిన పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకునే అవకాశం కనిపిస్తోంది. సమావేశాలకు ఇటు అధికార కాంగ్రెస్.. అటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌.. అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి. ఎవరి తోలు ఎవరు తీస్తారో చూద్దామంటు సవాళ్లు విసురుకుంటున్నాయి. అయితే.. సభను హుందాగా నడుపుకుందామని అన్ని పక్షాలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపు ఇవ్వడం గమనార్హం.  

ఇరిగేషన్‌ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌ సర్కార్‌పై ప్రతిపక్ష నేత కేసీఆర్ తీవ్ర​స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో తోలు తీస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. దానికి కౌంటర్‌గా సీఎం రేవంత్‌ చేసిన ప్రతివ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. అయితే కేసీఆర్ సభకి వచ్చి చర్చలో పాల్గొని ఆ ఆరోపణలు నిరూపించాలని కాంగ్రెస్‌ ప్రతిసవాల్‌ విసిరింది. మరోపక్క కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధ పాలమూరు-రంగారెడ్డిపై కేసీఆర్‌ తన పదేళ్ల హయాంలో ఎందుకు పెట్టలేదని అధికార పార్టీకి చెందిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ తరుణంలో కేసీఆర్‌ తొలిసారి సమావేశాలకు హాజరవుతారనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలోని నిర్ణయాలను ఎండగట్టడంతో పాటు గత రెండేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తామని ఒకవైపు మంత్రులు.. మరోవైపు అధికార ఎమ్మెల్యేలు, హామీల ఎగవేతతో పాటు జల వనరుల విషయంలో ప్రదర్శిస్తున్న కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్లక్ష్య ధోరణిని బయటపెడతామని బీఆర్‌ఎస్‌.. ఇంకోవైపు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు చేస్తున్న మోసాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని, సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీజేపీ అంటోంది. 

ఈ సెషన్‌లోనే శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అలాగే.. ఇటీవల ఆర్డినెన్స్ రూపంలో తీసుకువచ్చిన కొన్ని బిల్లులను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

షెడ్యూల్‌ ఇలా.. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. తొలుత.. శాసనసభ, శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు రద్దు ఉంటుంది. ఉభయ సభల్లో దివంగత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఆపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, సీతక్క చర్చల కోసం వివిధ పత్రాలను సభలో  ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలు వాయిదా పడ్డ తర్వాత.. సమావేశాల ఎజెండా ఖరారు, ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశాలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అధ్యక్షతన  బీఏసీ సమావేశం జరగనుంది. కనీసం 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.

ఇరిగేషన్‌ ప్రధానాంశంగా..
ఈసారి అసెంబ్లీ సమావేశంలో కృష్ణ గోదావరి నదీ జలాలు, ప్రాజెక్టుల పై ప్రధాన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల తగ్గింపు పై చర్చించాలని పట్టుబడుతోంది గులాబీ పార్టీ. దానికి కౌంటర్‌గా.. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. ఇలాంటి చర్చే గనుక జరిగితే తమకూ పీపీటీ ప్రజంటేషన్‌కు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ కోరే అవకాశం లేకపోలేదు.

హైదరాబాద్‌కు కేసీఆర్‌
కేసీఆర్‌ ఈ సమావేశాలకు హాజరవుతారనే అంశంపై బీఆర్‌ఎస్‌ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక.. ఇప్పటిదాకా ఆయన రెండుసార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. అయితే.. ఆయన ఆదివారం హైదరాబాద్‌కు చేరుకోవడంతో కచ్చితంగా హాజరు కావొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఈ ఉదయం నందినగర్‌ నివాసంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యి సభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement