కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు | KTR Key Comments At BRS Formation Day Celebrations | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

Apr 27 2026 12:59 PM | Updated on Apr 27 2026 1:05 PM

KTR Key Comments At BRS Formation Day Celebrations

సాక్షి, హైదరాబాద్‌: భారతదేశ రాజకీయ చరిత్రలోనే పాతిక వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు కొన్ని మాత్రమేనని.. అందులో భారత రాష్ట్ర సమితి ఒకటని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో జెండా ఎగరేసిన ఆయన.. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘‘14 ఏళ్ల​ పాటు తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ సాధించారు. ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్‌ఎస్‌. గత రెండున్నరేళ్లుగా దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. తెలంగాణను మళ్లీ గాడిన పెట్టేందుకు పోరాడతాం. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ పునరంకితం అవుతుంది. కేసీఆర్ సైనికులుగా బలగంగ కలిసికట్టుగా కదం తొక్కుతాం. 

‘‘మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు కేసీఆర్‌ రానున్నారు. నేతలకు దిశ నిర్దేశం చేస్తారు’’ అని కేటీఆర్‌ తెలిపారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ అధినేత్రి కవిత చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ఆయన విముఖత ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement