భూ వివాదం.. కత్తులతో దాడులు | Land Dispute Escalates in Bhadradri Kothagudem District | Sakshi
Sakshi News home page

భూ వివాదం.. కత్తులతో దాడులు

May 15 2026 7:15 PM | Updated on May 15 2026 7:41 PM

Land Dispute Escalates in Bhadradri Kothagudem District

అశ్వరావుపేట:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం బండారు గుంపులో భూవివాదం తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. భూ వివాదం ముదరడంతో రెండు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నారు. కళ్లలో కారం కొట్టుకుని కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల పరిధిలో భూవివాదాలు తరచుగా వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే తాజాగా చోటు చేసుకున్న భూవివాదం తారాస్థాయికి చేరుకుని కత్తులతో దాడులు చేసుకునే వరకూ వెళ్లడం చర్చనీయాంశమైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement