బండి భగీరథ్‌ పోక్సో కేసులో కీలక పరిణామం | bandi bhageerath apply for interim bail in telangana high court | Sakshi
Sakshi News home page

బండి భగీరథ్‌ పోక్సో కేసులో కీలక పరిణామం

May 12 2026 2:33 PM | Updated on May 12 2026 3:40 PM

bandi bhageerath apply for interim bail in telangana high court

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోసం బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మే 14న విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇక ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. సిట్‌ బృందం భగీరథ్‌ను స్వయంగా విచారణ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. పోక్సో కేసు నమోదు, సిట్‌ ఏర్పాటు పరిణామాల నడుమ భగీరథ్‌ పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిసిన వెంటనే పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా భగీరథ్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో బండి భగీరథ్‌ మధ్యంతర బెయిల్‌ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 

కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే 
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై పేట్ బషీరా బాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసు దర్యాప్తును ప్రత్యేక బృందానికి అప్పగించారు. కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితిరాజ్ ఈ టీమ్‌ను పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఎం. రమేశ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుత్బుల్లాపూర్ సమీపంలోని సుచిత్రలో నివసించే పదిహేడేళ్ల బాలికపై భగీరథ అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు శుక్రవార రాత్రి పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తనతో స్నేహం చేసిన భన రథ డిసెంబర్ 31న మొయినాబాద్ లోని ఫామ్ హౌస్‌కు  తీసుకువెళ్లారని, పెళ్లి చేసుకుంటానంటూ ఆదేరోజు రాత్రి అసభ్యంగా ప్రవర్తించారని మైనర్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భగీరథపై కేసు నమోదు చేశారు.

బాలికను భరోసా కేంద్రానికి తీసుకువెళ్లడంతో పాటు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే పేట్ బషీరాబాద్ ఠాణాలో కేసు నమోదుకు ముందే కరీంనగర్ లో సదరు బాలికపై భగీరథ ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం సమీక్ష నిర్వహించారు. కాగా ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ సాగుతుందని, ప్రతి అంశాన్నీ పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామని సైబరాబాద్ సీపీ ప్రకటించారు. మరోవైపు భగీరథపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుమోటోగా స్వీకరించింది.

బండి భగీరథ్ కేసులో ట్విస్ట్.. టార్గెట్ బండి సంజయ్!

బండి భగీరథ పరారీలో ఉన్నట్లు కేసు విచారణాధికారి,డీసీపీ రీతిరాజ్ సోమవారం మీడియాకు తెలిపారు. మూడు రోజులుగా అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ లో ఉందని చెప్పారు. అతని ఆచూకీ కోసం గాలి స్తున్నామని, కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్) పరిశీలిస్తుస్తున్నామని వెల్లడిం చారు. బాలిక స్టేట్మెంట్ రికార్డ్ చేశామని, మరిన్ని వివరాల కోసం ఇం కోసారి ప్రశ్నిస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement