ఇంటర్ విద్యలో కీలక మార్పులు.. తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక | Telangana Inter Board unveils major exam reforms | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యలో కీలక మార్పులు.. తెలంగాణ విద్యార్థులకు ముఖ్య గమనిక

May 14 2026 9:16 PM | Updated on May 14 2026 9:25 PM

Telangana Inter Board unveils major exam reforms

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 2026-2027 అకడమిక్ ఇయర్ నుంచే నూతన విద్యా విధానం అమల్లోకి రానుంది. ఫస్ట్‌ ఇయర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటనీ, జూలజీలో  ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫస్ట్‌ ఇయర్‌లో 15 మార్కులు, సెకండ్‌ ఇయర్‌లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. బోర్డు మ్యాథ్స్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను ప్రవేశపెట్టింది. ఫైనల్ ఎగ్జామ్స్‌లో మ్యాథ్స్‌ మార్కులు 75 నుండి 60కి తగ్గించింది. 

ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో ఒక్కో ఏడాదికి 15 మార్కులు కేటాయించారు. హ్యూమానిటీస్‌లో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా 20 మార్కులు పొందే అవకాశం కల్పించారు. ఫైనల్ పరీక్షలు 100 మార్కుల బదులు 80 మార్కులకే నిర్వహించనున్నారు. లాంగ్వేజెస్‌లో కూడా ఫైనల్ ఎగ్జామ్స్ 100 మార్కుల బదులు 80 మార్కులకే జరుగుతాయని ఇంటర్‌ బోర్డు వర్గాలు తెలిపాయి. 

Advertisement
 
Advertisement
Advertisement