ఎస్‌బీఐ బ్యాంకులో భారీగా డబ్బు మాయం..! | 23 Lakh Missing in Yusufguda SBI Branch | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ బ్యాంకులో భారీగా డబ్బు మాయం..!

May 11 2026 9:35 AM | Updated on May 11 2026 9:35 AM

23 Lakh Missing in Yusufguda SBI Branch

హైదరాబాద్‌: యూసుఫ్‌గూడ ఎస్‌బీఐలో రూ.23 లక్షలు మాయమయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. యూసుఫ్‌గూడ ఎస్‌బీఐలో క్యాష్‌ ఇన్‌చార్జ్‌గా అబ్బిరెడ్డి యాదగిరిరెడ్డి పని చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌ 7న యూసుఫ్‌గూడ బ్రాంచిలోని పాత ఏటీఎం స్ధానంలో ఎస్‌పీఆర్‌ మిషన్‌ను ఏర్పాటు చేయాలని బ్యాంకు నిర్ణయించింది. బ్యాంకు రికార్డులో రూ 27.5 లక్షలు ఎంట్రీ చేశారు. 

బ్యాంకు ఏటీఎం నుంచి  డబ్బులు తీయకుండానే తీసినట్లుగా బోగస్‌ ఎంట్రీలు సృష్టించారు. మరుసటి రోజు యాదగిరి రెడ్డి ఇతర సిబ్బందితో కలిసి ఏటీఎంలోని డబ్బు పెట్టెలను బ్యాంకు స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. బ్యాంకు అధికారులు డబ్బు పెట్టెలను లెక్కించి చూడగా.. నగదులో తేడా వచి్చంది. రూ23 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. సీసీ టీవీ కెమెరాలు పరిశీలించగా.. యాదగిరి రెడ్డి ఉద్దేశపూర్వకంగానే మోసానికి పాల్పడి, డబ్బును కాజేసినట్లు బ్యాంకు అదికారులు నిర్ధారించారు. ఈ మేరకు ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement