సీఎం రేవంత్ కాన్వాయ్‌ వాహనాల తగ్గింపు.. | CM Revanth Cuts Down Convoy Vehicles | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్ కాన్వాయ్‌ వాహనాల తగ్గింపు..

May 15 2026 9:30 PM | Updated on May 15 2026 9:34 PM

CM Revanth Cuts Down Convoy Vehicles

హైదరాబాద్:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో వాహానాలు తగ్గించాలని నిర్ణయించారు. ఇక నుంచి నాలుగు వాహనాలతోనే సీఎం రేవంత్‌ కాన్వాయ్‌ బయల్దేరనుంది.  అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ మధ్యనే సీఎం కాన్వాయ్‌ వెళ్లడానికి నిర్ణయించారు. రేపు(శనివారం) ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌ ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఆయన కాన్వాయ్‌కు సంబంధించిన వాహనాలపై నిర్ణయం తీసుకున్నారు. 

పశ్చిమాసియాలో  ఇంధన సంక్షోభం నేపథ్యంలో భారత ప్రధాని మోదీ పిలుపు మేరకు పలు రాష్ట్రాల సీఎంలు తమ కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించుకుంటున్నారు. అదే సమయంలో పలువురు మంత్రులు సైతం వాహనాల వాడకాన్ని కాసేపు పక్కనపెట్టి సైకిళ్లు, మెట్రోల్లో, ఎడ్లబండిపై పయనిస్తున్నారు. 

ఇక ప్రధాని మోదీ కూడా తన కాన్వాయ్‌లోని వాహనాలను రెండుకు పరిమితం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో తొలుత కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించుకునే యత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే సీఎం రేవంత్‌ కూడా తన కాన్వాయ్‌ వాహనాలను నాలుగుకు పరిమితం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement