బండి భగీరథ కేసులో ఆ పేరు వాడొద్దు: కోర్టు | City Civil Court Directions on Bandi Bhagarath Case | Sakshi
Sakshi News home page

బండి భగీరథ కేసులో ఆ పేరు వాడొద్దు: కోర్టు

May 15 2026 5:31 PM | Updated on May 15 2026 5:42 PM

City Civil Court Directions on Bandi Bhagarath Case

హైదరాబాద్:  బండి భగీరథ కేసులో సిటీ సివిల్‌ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.   ఈ కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ పేరును వాడొద్దంటూ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ కేసులో తన పేరును వాడుతున్నారంటూ సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్‌. 

ఈ మేరుకు విచారించిన కోర్టు.. బండి భగీరథ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ పేరు వాడొద్దంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ​బండి భగీరథ కేసు విషయంలో బండి సంజయ్ పేరును ఎక్కడా ఉపయోగించరాదని స్పష్టం చేసింది సివిల్‌ కోర్టు. 

తన పేరును ఉపయోగిస్తూ మీడియాలో ఎలాంటి వార్తలు రాయకుండా చూడాలని కోరారు. ​ ఇప్పటివరకు మీడియాలో తన పేరుతో వచ్చిన ఈ కేసుకు సంబంధించిన వార్తలను డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు బండి సంజయ్‌. కేంద్రమంత్రి బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది సిటీ సివిల్‌ కోర్టు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement