సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీఈఏపీసెట్–2026 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూహెచ్ క్యాంపస్‌లోని గోల్డెన్ జూబ్లీహాల్‌లో ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు అధికారికంగా ప్రకటించారు.
ఈ నెల 4 నుంచి 11 వరకు ఈఏపీసెట్ పరీక్షలు జరిగాయి. ఈ నెల 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు జరగ్గా ఈ నెల 9 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి. పరీక్షలకు దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
👉టీజీ ఈఏపీసెట్ 2026 ఇంజినీరింగ్ రిజల్ట్ డైరెక్ట్ లింక్
👉 టీజీ ఈఏపీసెట్ 2026 అగ్రికల్చర్, ఫార్మసీ రిజల్ట్ డైరెక్ట్ లింక్


