తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజ‌య‌లక్ష్మి | Gadwal Vijayalakshmi Appointed as Chairperson Womens Commission | Sakshi
Sakshi News home page

తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజ‌య‌లక్ష్మి

May 11 2026 7:03 PM | Updated on May 11 2026 7:46 PM

Gadwal Vijayalakshmi Appointed as Chairperson Womens Commission

హైదరాబాద్‌: తెలంగాణ మ‌హిళా క‌మిషన్‌కు కొత్త ఛైర్‌పర్సన్‌, సభ్యులు నియమితుయ్యారు. ఈ కమిషన్‌ ఐదేళ్ల పాటు ఉంటుంది. ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజ‌య‌లక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, దివంగ‌త శ్రీకాంతచారి త‌ల్లి కాసోజు శంక‌ర‌మ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాక‌లి ఐల‌మ్మ మ‌న‌వ‌రాలు చిట్యాల శ్వేతను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

శశిక‌ళ యాద‌వ రెడ్డి, స‌దాలక్ష్మి, రాధాభాయి, ఉజ్మా ష‌కీరా కూడా స‌భ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వు జారీ చేశారు. ఇంతకుముందు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద ఉన్న విషయం తెలిసిందే. నేరెళ్ల శారదకు ముందు ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి ఉన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement