‘యావన్‌ను హత్య చేయడానికి కారణం అదే’ | DCP On Chilakalguda Yavan Case | Sakshi
Sakshi News home page

‘యావన్‌ను హత్య చేయడానికి కారణం అదే’

May 11 2026 6:53 PM | Updated on May 11 2026 6:58 PM

హత్య గావించబడ్డ యవన్‌(ఫైల్‌ఫోటో)

సికింద్రాబాద్‌: చిలకలగూడకు చెందిన యావన్‌ హత్య  ప్రీ ప్లాన్డ్‌ మర్డర్‌ అని సికింద్రాబాద్‌ డీసీపీ రక్షిత స్పష్టం చేశారు. అమ్మాయి కుటుంబ సభ్యులు ప్లాన్‌ ప్రకారం హత్య చేశారన్నారు. అమ్మాయి తండ్రి, బాబాయి, బావ, అన్న, కజిన్‌ బ్రదర్స్‌ కలిసి యావన్‌ను హత్య చేసినట్లు గుర్తించామన్నారు. మే 7వ తేదీ జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి వివరాలను డీసీపీ మీడియాకు వెల్లడించారు.

మే 7 అర్ధరాత్రి యావన్ హత్య జరిగింది. ఐదు ప్రత్యేక బృందాలతో ఈ కేసు దర్యాప్తు చేసాము.. యావన్, చంద్రికలు స్కూల్ డేస్ నుండి ఫ్రెండ్స్.. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. గతంలో అమ్మాయి కుటుంబ సభ్యులు యావన్ ను హేచ్చరించారు. హత్యకు ఐదు రోజుల ముందే హత్య కోసం నిందితులు ప్లాన్ చేసుకున్నారు. అందరూ కలిసి రెక్కి నిర్వహించారు. 

A1 అల్లబోయిన సాయి కిరణ్ యువతి బావ.. ప్రధాన నిందితుడు..హత్య కు ప్లాన్ చేశారు. సాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ కేసులో మొత్తం 10 మందిని అరెస్ట్‌ చేశాం. నిందితులలో ఇద్దరికి గాంజా పాజిటివ్ వచ్చింది ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులతో పాటు ఓ మైనర్ అరెస్ట్ చేశాం’ అని తెలిపారు. 

ప్రేమించాడని నరికి చంపారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement